సూపర్ స్టార్ రజినీకాంత్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పేట. ఈ చిత్రం తెలుగు, తమిళంలో భారీ అంచనాల నడుమ విడుదలైంది. తెలుగు వెర్షన్ పేట సినిమాకు మొదటి నుండి థియేటర్స్ సమస్యగా మారింది. పేట కు థియేటర్స్ దొరకడం లేదని ధియేటర్ మాఫియాగా కొంతమంది నిర్మాతలు సినిమా ఇండస్ట్రిలో అధికారం సాగిస్తున్నారని, పేట తెలుగు వెర్షన్ నిర్మాత వల్లభనేని అశోక్ వాళ్ల పేర్లను కూడా బయటపెట్టాడు. అయినా సినిమాను అదే రోజు విడుదల చేస్తానని, సక్సెస్ కొట్టి అందరికి బుద్ది చెప్పుతా అన్నాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ చిత్రం నిన్న గురువారం నాడు తెలుగు, తమిళంలో విడుదలైంది. మొదటి రోజునే ఈ చిత్రం డివైడ్ టాక్ ను దక్కించుకుంది. రజినీకాంత్ యొక్క మ్యానరిజం, స్టైల్,డైలాగ్ డిలివరి ఇష్టపడే వారికే సినిమా నచ్చుతుందని అన్నారు.
అప్పుడు పేట సినిమాకు థియేటర్స్ సరిపోవడం లేదని వాదించిన వారె ఇప్పుడు పేట సినిమాకు ఉన్న టాక్ చూస్తే ఉన్న థియేటర్స్ నుండి సినిమాను తియ్యకుంటే చాలు అనుకునే పరిస్థితి నెలకొన్నది. ఈ రోజు చరణ్ వినయ విధేయ రామ, రేపు వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టి స్టారర్ ఎఫ్2 సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు కానీ మంచి టాక్ ను దక్కించుకుంటే మాత్రం పేట కు థియేటర్స్ సమస్య చాలా క్లిష్టంగా ఉంటుంది. లేకపోతె ఈ రెండు సినిమాలు కానీ ప్లాప్ అనే టాక్ ను దక్కించుకుంటే మాత్రం పేట సినిమాకు ఎదావిధిగా ఉన్న ఇప్పుడు ఉన్న థియేటర్స్ లోనే సినిమా అదే అవకాసం ఉంటుంది. అసలకే వరస ప్లాప్స్ తో సతమత మవుతున్న రజినీకాంత్ కు పేట సినిమా డివైడ్ టాక్ దక్కడం రజినీకాంత్ ఫాన్స్ కు మాత్రం నిరాశే. పేట సినిమాతో హిట్ట్ కొట్టి మరల ట్రాక్ లోకి రావాలనుకున్నా సూపర్ స్టార్ కి పేట సినిమా మాత్రం కొంతైనా నిరాశను మిగిలిస్తుంది. ఈ చిత్రం తరువాత మురగదాస్ తో ఓ సినిమా లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తాడు.