Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీ రెడ్డి, ఈ పేరు తెలియని స్టేజ్ నుండి ఈ పేరే ఒక సెన్సేషన్ అనే అ స్టేజ్‌కి వచ్చేసింది శ్రీ రెడ్డి అలియాస్ విమల మల్లిడి. అయితే గత కొద్దిరోజుల క్రితం నుండి ఈమె తెలుగు వారికి అనేక షాక్ లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. తెలుగు ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, దాని బారిన పడిన తెలుగు అమ్మాయిలు ఎంతో మంది పెదవి బిగిన బాధని బరించి వెనక్కు పోతున్నారని వారందరికీ ఒక పరిష్కారం చూపేందుకు పోరాటం చేస్తున్నానంటూ ఆమె ఒక పోరాటాన్ని మొదలుపెట్టింది, తెలుగు చిత్రసీమలో క్యాస్టింగ్ కౌచ్ నిర్మూలన కి తానూ చెప్పిన ప్రణాళిక పాటించడం, అలాగే సినీ అవకాశాల్లో 75 శాతం తెలుగు వారికి ఇచ్చేలా చూడడం ఇవే ఆమె ప్రధాన డిమాండ్స్.
టాలీవుడ్ పెద్దలు దీనిని పట్టించుకోకపోవడంతో శ్రీ రెడ్డి లీక్స్ స్టార్ట్ చేసింది. తనకు సినిమాల్లో అవకాశాలను ఎరచూపి శారీరకంగా మానసికంగా హింసించిన టాలీవుడ్ బడా బాబుల గుట్టు ఒక్కొక్కటిగా బయటకి తీస్తోంది. ఆమె ఎప్పుడు ఎవరి పేరును బయటపెడుతుందోనని టాలీవుడ్ పెద్దలతో బాటు, సామాన్య ప్రజలకి కూడా కంటి మీద కునుకు లేకుండా పోయింది. అయితే ఇవీవి పట్టించుకోని మా అసోసియేషన్ ముంది అర్ధనగ్న ప్రదర్సనకి దిగి దేశవ్యాప్తంగా వార్తలలోకి ఎక్కింది. అయితే శ్రీరెడ్డి చేసిన చర్యను ఖండిస్తూ.. ఆమె అసలు మా లో చేరకుండానే ఇలా మా మూవీ ఆర్టిస్ట్స్ పరువు తీసే ఏ నటీ మాకక్కర్లేదు అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ.. ఆమెతో భవిష్యత్ ఎవరూ నటించరని, ఏ నిర్మాత, దర్శకులు అవకాశం ఇవ్వరంటూ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది ‘మా’.
అయితే ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్న ఆమె తన జీవితం నాశనం అయిపోయినా పర్లేదు కాని తనలా మరో తెలుగు నటికి అన్యాయం జరగకూడదంటూ తన ఉద్యమాన్ని ఉదృతం చేసింది. అందులో భాగంగా టాలీవుడ్ బడా నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు కుమారుడు అభిరామ్ తో ఉన్న శారీరక సంబంధాన్ని తెలిపేలా ఉన్న ఫోటోలను మీడియాకు లీక్ చేసింది శ్రీరెడ్డి. అంతేకాకుండా రచయిత కోన వెంకట్ తనతో జరిపిన సెక్సీ చాట్ స్క్రీన్ షాట్లను కూడా బహిర్గతం చేసి ఇండస్ట్రీకి వణుకు పుట్టేలా చేసింది. అయితే శ్రీరెడ్డి మొదటి నుండి మెయిన్ గా చేస్తున్న డిమాండ్ ఏంటంటే తెలుగు హీరోయన్లకు అవకాశాలు కావాలి అని అయితే డైరెక్టర్స్ అందరిలో ముందుగా రియాక్ట్ అయిన తేజ తనని వాడుకున వారి పేర్లు చెప్పిందని వారు తనకి సినిమా అవకాశాలు ఇవ్వాల్సిందేనని ప్రస్తుతానికి తానూ చేస్తున్న రెండు సినిమాలలోను ఆమెకి రెండు పాత్రలు ఆఫర్ చేసినట్టు ప్రకటించాడు. అయితే సినిమా ఆఫర్ వచ్చింది కాబట్టి ఇక ఆమె సైలెంట్ అయిపోతుంది అని భావించారు. కానీ శ్రీరెడ్డికి తేజ సినిమాలో ఆఫర్ ఇవ్వడం వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్లు శ్రీ రెడ్డి ఆరోపించింది.
ప్రస్తుతం తేజ.. బాలయ్యతో ‘ఎన్టీఆర్’ మూవీని తెరకెక్కిస్తుండగా… ఆ తరువాత చిత్రం విక్టరీ వెంకటేష్-నారా రోహిత్ లతో చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్లో సురేష్ బాబు నిర్మిస్తున్నారు. గతేడాది చివరిలోనే ఈ సినిమాకి ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఇన్నాళ్లూ తనను ఓ బడా నిర్మాత కొడుకు సినిమాల్లో అవకాశం ఇస్తానని వాడుకున్నాడంటూ అతడి గుట్టుని బహిర్గతం చేస్తా అంటూ మీడియా ముందు ఆమె చెప్పడంతో ఎక్కడ అభిరామ్ పేరు బయటపెడుతుందోనని శ్రీరెడ్డికి తన సినిమాలో ఆఫర్ ఇచ్చేందుకు నిర్మాత సురేష్ బాబు దర్శకుడు తేజాను రంగంలోకి దింపినట్టు శ్రీ రెడ్డి ఆరోపిస్తోంది. సురేష్ బాబు దర్శకుడు తేజతో ఆఫర్స్ పేరుతో తనకు బిస్కెట్స్ వేసే ప్రయత్నం చేశారని ఆరోపించింది శ్రీరెడ్డి. ఇక తేజతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షడు శివాజీ రాజా కూడా ఈ వివాదంలో తమ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడని కొంత డబ్బు ఇచ్చేందుకు ప్రలోభ పెట్టినట్టు శ్రీరెడ్డి తెలిపింది. అయితే ఈ విషయం మీద ఇప్పటిదాకా సురేష్ బాబు కాని, దగ్గుబాటి కుటుంబం నుండి ఇంకెవరు కానీ స్పందించలేదు.