రేషన్ కార్డులపై ప్రధాని మోదీ బొమ్మ ఉండాల్సిందే…

తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త కార్డుల జారీకి పలు నమూనాలను సైతం సీఎం రేవంత్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో మరోసారి రేషన్ కార్డులపై ప్రధాని మోదీ బొమ్మ పెట్టాలనే డిమాండ్‌ను తెలంగాణ బీజేపీ నేతలు బలంగా వినిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఉచితంగా రేషన్ అందిస్తోందని.. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ అధినేత అయిన మోడీ బొమ్మ పెట్టాడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకి ఏంటని పాలమూరు ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి వాటా లేదని స్పష్టం చేశారు.