బుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 జూలై 21 నుండి ప్రారంభం కానుండగా, ఈ కార్యక్రమంపై కొద్ది రోజులుగా అనేక ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా బిగ్ బాస్ నిర్వాహకులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులకి ఫిర్యాదు చేశారు. కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని కోరారు. ఓయూ జేఏసీ కొద్ది సేపటి క్రితం నాగార్జున ఇంటిని చుట్టుముట్టి .. బిగ్ బాస్ షోని నిలిపివేయాలని నినాదాలు చేశారు. వీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున హోస్ట్‌గా రూపొందనున్న బిగ్ బాస్ కార్యక్రమం 15 మంది సెలబ్రిటీలతో వంద రోజుల పాటు జరగనుంది.