Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి mrps ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కురుక్షేత్ర సభకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎప్పటినుంచో పోరాడుతున్న మంద కృష్ణ మాదిగ ఈసారి చంద్రబాబు సర్కార్ ని టార్గెట్ చేశారు. ఏపీ రాజధాని అమరావతికి సమీపంలో గుంటూరు, విజయవాడ మధ్య ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా వున్న స్థలంలో కురుక్షేత్ర సభ జరిపితీరుతామని కృష్ణ మాదిగ ప్రకటించారు. అయితే అదే స్థలంలో తాము కూడా ఓ సభని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నట్టు మాలమహానాడు కూడా దరఖాస్తు చేసుకుంది. పోటాపోటీగా సభలు జరిగితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్న అనుమానంతో రెండు సభలకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. పైగా ఈ రెండు సభలు జరపాలని భావించిన స్థల యజమానులు నుంచి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోలేదని కూడా పోలీసులు వివరించారు. రెండు సభల అనుమతి నిరాకరణకు సంబంధించి ఖాకీలు విడుదల చేసిన ప్రెస్ నోట్ మీ కోసం…
మరిన్ని వార్తలు
జగన్ పాదయాత్రకి రెడీ…ప్లీనరీ లో ప్రకటన?
బెంజ్ సీఈఓ కారు మీద ఉద్యోగి కాల్పులు… వైరల్ వీడియో
చంద్రబాబుకు ఒకే ఒక కోరిక