Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముద్రగడ పద్మనాభం స్వగ్రామం కిర్లంపూడిలో మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఈ ఉదయం మరోసారి ఆయన పాదయాత్ర చేస్తానంటూ బయటికి వచ్చారు. ఎప్పటిలాగానే పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడ సైతం రొటీన్ గా చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. బాబు పాదయాత్ర టైం లో అనుమతి కోసం దాఖలు చేసిన పత్రాన్ని చూపిస్తే తానూ అదే రీతిలో అప్లై చేస్తానని చెప్పారు. పోలీసులు మాత్రం సుప్రీమ్ కోర్టు నిబంధనలకు లోబడి అనుమతి తీసుకునే దాకా ముద్రగడని పాదయత్రకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ మొత్తం బాగా రొటీన్ గానే సాగిపోయింది. అయితే ముద్రగడ ఇంటిలో మాత్రం ఓ డైలాగ్ భలే పేలిందట.
ముద్రగడ ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటికి రాగానే పాదయాత్ర కి వెళ్లిపోయారన్న మాట వినగానే ఆ ఇంటిలో పని చేసే మనిషి సార్ బట్టలు సర్దలేదు కదా అనడంతో అక్కడ ఉన్నవాళ్ళంతా పక్కున నవ్వారంట. ఆ నవ్వుకి అర్ధం ఆ పని మనిషికి అర్ధం కాలేదు కానీ ఆ నవ్వు నవ్విన వారికి తెలుసు. అయినా పోలీసులు ఇన్ని సార్లు ఆపుతున్నా అనుమతి కోసం దరఖాస్తు కూడా చేయకుండా పాదయాత్ర చేస్తాననడం చూస్తుంటే ముద్రగడ ఆలోచన ఇంకేందో అని వేరే చెప్పాలా ?
మరిన్ని వార్తలు: