Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నిన్న మొన్నటి వరకు హీరోగా, నిర్మాతగా కోలీవుడ్‌లో సందడి చేసిన విశాల్ ఇప్పుడు ఒక్కసారిగా తమిళనాట రాజకీయ తెరపై మెరుస్తున్నాడు. ఇప్పటికే తమిళనాట రాజకీయం రసకందాయం ఉంది. ఎప్పుడు ఎలాంటి మార్పులు, చేర్పులు జరుగుతాయి, ఎప్పుడు ప్రభుత్వం ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో విశాల్ తమిళనాట రాజకీయాల్లోకి అడుగు పెట్టడం అందరికి షాకింగ్‌గా ఉంది. అప్పుడే విశాల్‌పై రాజకీయ విమర్శలు మొదలు అయ్యాయి. విశాల్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా, శశికళ, దినకరన్ ఆయన్ను రంగంలోకి దించారు అంటూ కొందరు అంటున్నారు. ఇక కొందరు సినీ వర్గాల వారు కూడా విశాల్‌పై వ్యతిరేకంగా ఉన్నారు.
ఎమ్మెల్యేగా నామినేషన్ విశాల్ వెంటనే నిర్మాతల మండలికి మరియు నడిగర్ సంఘం పదవులకు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమిళంకు చెందిన ఒక దర్శకుడు మీడియా ముందుకు వచ్చి విశాల్ వెంటనే తన పదవుకు రాజీనామా చేయాలని, ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ప్రచారం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.
విశాల్‌కు సినిమా పరిశ్రమలో పదువుల్లో ఉండగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత లేదు అంటూ ఆయన రోపిస్తున్నాడు. కాని కొందరు మాత్రం విశాల్ ఎమ్మెల్యేగా పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నారు. విశాల్ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నడిగర్ సంఘం మరియు నిర్మాతల మండలి పదవుల్లో కొనసాగవచ్చు అంటున్నారు. మొత్తానికి ప్రస్తుతం సినీ పరిశ్రమలో మరియు రాజకీయ వర్గాల్లో విశాల్‌ను టార్గెట్ చేశారు. ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి.