Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జయ మరణం తర్వాత అంతటి లీడర్ ను తయారుచేసుకోవడానికి కష్టపడుతున్న అన్నాడీఎంకే.. అమ్మ వెళ్లిపోగానే మూడు ముక్కలు మాత్రం అయింది పార్టీ. అప్పట్నుంచి మూడు వర్గాలుగా విడిపోయి అధికార పార్టీ నేతల కొట్టుకుంటూనే ఉన్నారు. స్టాలిన్ కు అయాచిత వరాలు అందిస్తున్నారు.
తమిళనాడులో ఎన్నో సమస్యలున్నా.. ఇంతవరకూ వీరు మాత్రం దేనిపైనా పోరాడిన చరిత్ర లేదు. తమలో తామే కొట్టుకుంటూ కేంద్రాన్ని అడగలేని పరిస్థితిలో ఉన్నారు. తమిళనాడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రిసార్ట్ పాలిటిక్స్ నడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా.. పళనిస్వామి బలమైన సీఎంగా మాత్రం పేరు తెచ్చుకోలేకపోతున్నారు.
జనం సంగతి పక్కనపెడితే కనీసం సొంత పార్టీలోనూ నిరాశే కనిపిస్తోంది. అందుకే విలీన చర్చలు ఊపందుకున్నాయి. కానీ మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు చెన్నై ఎయిర్ పోర్ట్ లో మూడు వర్గాలకు చెందిన నేతలు మనసు విప్పి మాట్లాడుకున్నారనే పుకార్లొచ్చినా.. పన్నీర్ సెల్వం అలాంటిదేమీ లేదని అన్నాడీఎంకే అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు.
మరిన్ని వార్తలు: