హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్స్ ఛాన్స్‌ల కోసం కొన్ని సార్లు మనస్సు చంపుకుని నిర్మాత లేదా దర్శకుడి కోరిక తీర్చాల్సి వస్తుంది. కాని కొందరు మాత్రం ఆ అవసరం లేదు, తమకు ఛాన్స్‌లు లేకున్నా పర్వాలేదు అనుకుంటారు. ఇక కొన్ని సార్లు దర్శక నిర్మాతలు బలవంతంగా హీరోయిన్స్‌ను బలిచేస్తారు. తాజాగా పూనం కౌర్ విషయంలో కూడా కాస్టింగ్ కౌచ్ జరిగిందట. గతంలో పలు సార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన పూనం కౌర్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. ఈమె ఎవరిపై ఆ వ్యాఖ్యలు చేసిందో మాత్రం తెలియడం లేదు.
ఇంతకు పూనం ఏమన్నదంటే… ఒకానొక సమయంలో తనకు ఒక నిర్మాత కలిశాడు. ఆ నిర్మాత నాతో మాట్లాడుతూ నీవు అందంగా ఉంటావు, మంచి నటన సామర్థ్యం ఉంది కాని నీకు మంచి బ్రేక్ రావడం లేదు. తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు ఉంది అన్నాడు. ఆ మాటలకు నాకు ఆనందం వేసింది. ఆ సమయంలో ఇంటికి ఒకసారి ఒంటరిగా వస్తే కలిసి మాట్లాడతా, దర్శకులను పరిచయం చేస్తాను అంటూ చెప్పాడు. కాని నాకు నమ్మకం లేక పోవడంతో తన తల్లిని తీసుకుని ఆ నిర్మాత ఇంటికి వెళ్లాను. దాంతో ఆయనకు కోపం వచ్చింది. ఒంటరిగా రమ్మంటే ఇలా తల్లితో రావడంతో ఆ నిర్మాత చిరాకు పడ్డాడు. ఆవేశంతో తన వారిని తిట్టినట్లుగా డ్రామా ఆడాడు. అతడి కోపంకు తాను ఒంటరిగా వెళ్లక పోవడమే కారణం అని అనిపించింది. అక్కడ నుండి తాము సదరు నిర్మాతతో మాట్లాడకుండానే వచ్చేశాం అంటూ చెప్పుకొచ్చింది.