‘బాహుబలి’ చిత్రం కోసం దాదాపు నాలుగు సంవత్సరాల పాటు విపరీతంగా కష్టపడ్డ ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ చిత్రం కోసం కూడా అదే విధంగా కష్టపడుతూ ఉన్నాడు. ‘సాహో’ చిత్రం భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో హైఓల్టేజ్ ఎనర్జిటిక్ మూవీగా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. అందుకే ఈ చిత్రం కోసం ప్రభాస్ ఒల్లు హునం అయ్యేలా కష్టపడుతున్నాడు. ఆమద్య దుబాయిలో ఏకంగా 90 రోజుల పాటు కష్టపడి వచ్చిన ప్రభాస్ ఆ తర్వాత కూడా ప్రభాస్ సినిమా కోసం పని చేస్తూనే ఉన్నాడు. తాజాగా ప్రభాస్ రామోజీ ఫిల్మ్ సిటీలో ‘సాహో’ చిత్రం షూటింగ్‌లో పాలొంటున్నాడు. చిత్ర కథానుసారం ఆ సీన్స్‌ను ఉదయాన్నే చిత్రీకరించాల్సి ఉందట. ఆ కారణంగా ప్రభాస్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే మకాం వేసినట్లుగా తెలుస్తోంది.
ప్రభాస్ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. ట్రాఫిక్‌తో పాటు ఇతరత్ర కారణాల వల్ల రెండు గంటలు పడుతుందని, మళ్లీ ఉదయాన్నే చిత్రీకరణ కోసం రావాలి అంటే ఇబ్బంది అవుతుంది. అందుకే చిత్రీకరణ జరుపుతున్నన్ని రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలోనే ప్రభాస్ ఉండబోతున్నాడు. వారాంతంలో తప్పించి వరుసగా ఫిల్మ్ సిటీలోనే ప్రభాస్ ఉంటున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా కోసం ఇంత కష్టపడుతున్న ప్రభాస్ కష్టంకు ప్రతిఫలం దక్కాలని, సాహో చిత్రం సూపర్ హిట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇంకా బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.