Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జర్నలిస్ట్ గౌరీలంకేశ్ హత్య దగ్గరనుంచి కేంద్రప్రభుత్వంపైనా, ప్రధాని మోడీపైనా విరుచుకుపడుతున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్… కర్నాటక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన విమర్శలకు మరింత పదును పెట్టారు. మోడీ నినాదాలన్నింటినీ తప్పుబట్టే ప్రకాశ్ రాజ్… తాజాగా సబ్ కీ సాథ్ సబ్ కా వికాస్ పై మండిపడ్డారు. కర్నాటక ఎన్నికల్లో పోటీచేస్తున్న ఓ బీజేపీ అభ్యర్థి భార్య ప్రచారం చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి ప్రకాశ్ రాజ్… ఆమె మతం పేరుతో ఓట్లు అడుక్కుంటోందని తీవ్రంగా దుయ్యబట్టారు. దక్షిణ కర్నాటకలోని చిక్ మంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న వేదవ్యాస్ కామత్ భార్య భర్త తరపున ప్రచారం చేస్తున్న వీడియోను ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
బీజేపీ అభ్యర్థి భార్య ఎలా ఓట్లను అడుక్కుంటోందో చూడండి. దక్షిణ కర్నాటకలోని మంగళూరు ప్రాంతంలో ఆమె మతాలను గుర్తుచేస్తూ తన భర్తకు ఓట్లువేయాలని అడుగుతోంది. కమ్యూనల్ పాలిటిక్స్ సిగ్గుచేటు. ఇదేనా మీ సబ్ కీ సాథ్, సబ్ కా వికాస్ అని అడుగుతున్నాను… అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
వీడియోలో కామత్ భార్య… అందరికీ నమస్కారం. నేను మంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్న వేదవ్యాస్ కామత్ భార్యను. ఈ ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గంనుంచి నా భర్తను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన అని ప్రచారం చేస్తూ హిందూ మతాన్ని ప్రస్తావించారు. భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేస్తుందని భావిస్తున్న కర్నాటక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతుండగా… అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రకాశ్ రాజ్ సహా జాతీయస్థాయిలో బీజేపీని వ్యతిరేకించేవారంతా కాంగ్రెస్ గెలిచేందుకు సహాయసహకారాలందిస్తున్నారు.
Look at a BJP candidates wife begging for votes on the basis of a religion in mangalore south /karnataka … shame on ur communal politics. Is this your “Sabki saath sabka Vikas “…#justasking pic.twitter.com/lHDbTa57O6
— Prakash Raj (@prakashraaj) April 27, 2018