Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ లో రోజా ఓ ఫైర్ బ్రాండ్. సహజంగా వాగ్ధాటి గల రోజా వైసీపీలో చేరిన దగ్గరనుంచి దూకుడు పెంచారు. టీడీపీ ని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. ఈ పరిణామం వైసీపీ శ్రేణుల్ని తాత్కాలికంగా సంతృప్తి పరిచినా, రోజా మాటలు, చేష్టలు ఆమెతో పాటు వైసీపీ కి కూడా నష్టం చేస్తున్నాయి. ఈ నోటిదూకుడు వల్లే తప్పు జరిగినప్పుడు కూడా రోజా మీద ఎదురుదాడితో ప్రభుత్వం తేలిగ్గా సమస్యని పక్కదారి పట్టించే అవకాశం దొరికేది. ఈ వ్యవహారంతో పార్టీకి నష్టమని తెలిసి కూడా వైసీపీ నేతలు నోరు ఎత్తలేకపోతున్నారు. అందుకు కారణం రోజా దూకుడు వెనుక జగన్ ప్రోత్సాహం ఉందన్న అభిప్రాయం. అయితే వైసీపీ కి సలహాదారుగా రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని గుర్తించడమే కాకుండా రోజా వల్ల పార్టీకి జరిగిన, జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ ఓ నివేదిక అందజేశారట. ఆ రిపోర్ట్ చదివి జగన్ కూడా ఆలోచనలో పడ్డారట.
వైసీపీ వ్యూహకర్తల్లో ఒకరిగా పేరుపడ్డ ఓ సీనియర్ నేత చెబుతున్న దాని ప్రకారం త్వరలో రోజాకి జగన్ చెక్ పెట్టే అవకాశం ఉందంటున్నారు. పార్టీ తరపున మాట్లాడే బాధ్యతను ఆవేశకావేశాలు లేకుండా వ్యవహరించే ఇంకో నేతకు కట్టబెట్టే ఛాన్స్ ఉందట. రోజాని పిలిచి స్వయంగా దూకుడు తగ్గించుకోవాలని జగన్ చెప్పవచ్చట. నోరు మంచిదైతే వూరు మంచిది అన్నట్టు పార్టీ ఏదైనా పద్ధతి లేకుండా మాట్లాడితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని సదరు నేత కామెంట్ చేసాడు. ఇక రోజా తర్వాత జగన్ చూపు అంబటి మీద పడే రోజు కూడా వస్తుందట. ప్రశాంత్ చెప్పిన దాని ప్రకారం పార్టీ అధికార ప్రతినిధులు అనేవాళ్ళు జనాల్లో సదభిప్రాయం కలవారై ఉండాలట. ఇదే ఫార్ములాని జగన్ పూర్తి స్థాయిలో ఫాలో అయితే రోజా తర్వాత అంబటి కి ఇబ్బంది తప్పేట్టు లేదు.