Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ జక్కన్న రాజమౌళితో ‘ఈగ’ వంటి అద్బుతమైన సినిమాను నిర్మించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన నిర్మాత సాయి కొర్రపాటి. మంచి కథలు ఎంచుకుని సినిమాలు తీస్తాడు అని ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలతో ఆయనపై ప్రేక్షకుల్లో నమ్మకం పెరిగింది. అయితే తాజాగా వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు రావడంతో సాయి కొర్రపాటి ఢీలా పడిపోయాడు. ‘బాహుబలి’ సినిమాను ఒక ఏరియాలో పంపిణీ చేయడం వల్ల దాదాపు 20 కోట్ల లాభాలను ఈ నిర్మాత దక్కించుకున్నాడు. బాహుబలితో వచ్చిన లాభాలు కాస్త ఇప్పుడు ఈ రెండు సినిమాలతో లాస్ వచ్చిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
జగపతిబాబు ప్రధాన పాత్రలో ‘పటేల్ సర్’ అనే చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించాడు. ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అయితే దక్కాయి, కాని సినిమాకు కలెక్షన్స్ మాత్రం రాలేదు, ఆ సినిమా దాదాపు ఏడు కోట్ల మేరకు నష్టాన్ని మిగిల్చినట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా ‘యుద్దం శరణం’ చిత్రంతో సాయి కొర్రపాటి వచ్చాడు. నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటం జరిగింది. ఈ ఫ్లాప్‌తో సాయి కొర్రపాటికి దాదాపు 12 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు. రెండు నెలల గ్యాప్‌లో విడుదలైన రెండు సినిమాలు కూడా దాదాపు 20 కోట్ల మేరకు ఈయనకు నష్టాలను మిగిల్చాయి. అయితే ఈ నష్టాలతో సాయి కొర్రపాటి భయపడకుండా మంచి కథలు ఎంచుకుని, కాస్త తక్కువ బడ్జెట్‌తో సినిమాలు చేస్తాడు అనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు.