కాజల్ ఇంకా అందకుండానే ఉంది

Producers Rejected Kajal For High Remuneration In Sharwanand Movie
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దశాబ్ద కాలంకు పైగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన కాజల్‌ ఇంకా కూడా అదే హోదాతో కొనసాగుతూ వస్తుంది. ఆఫర్లు తగ్గినా కూడా స్టార్‌ ఇమేజ్‌ను కాపాడుకుంటున్న ఈ అమ్మడు పారితోషికం విషయంలో మాత్రం అస్సలు తగ్గేది లేదు అంటోంది. గత సంవత్సరం ‘ఖైదీ నెం.150’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత తమిళం మరియు తెలుగులో పెద్దగా అవకాశాలను దక్కించుకోలేక పోయింది. అయినా కూడా ఈమె పారితోషికం మాత్రం తగ్గించడం లేదు. ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఒక చిత్రంలో ఈమె నటిస్తుంది. శర్వానంద్‌కు జోడీగా ఈమె నటించేందుకు నో చెప్పింది. 

శర్వానంద్‌ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కాజల్‌ను హీరోయిన్‌గా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కాని కాజల్‌ మాత్రం 1.25 కోట్లు డిమాండ్‌ చేసినట్లుగా తెలుస్తోంది. శర్వా సినిమా మార్కెట్‌కు ఆ పారితోషికం చాలా ఎక్కువ అని నిర్మాతలు ఆమెను కాకుండా మరో హీరోయిన్‌తో కమిట్‌ అయ్యారు. తాజాగా మరో చిత్రంను కూడా కోటి పారితోషికం డిమాండ్‌ చేసి అవకాశంను ఈ అమ్మడు పోగొట్టుకుంది. సినిమాల్లో పెద్దగా ఆఫర్లు లేని ఈ సమయంలో కూడా కోట్లు  డిమాండ్‌ చేస్తే కష్టం అని, ఇప్పటికైనా కాస్త పారితోషికం విషయంలో చిన్న నిర్మాతలకు అందేలా కాజల్‌ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇలాగే కొన్నాళ్లు కొనసాగితే కాజల్‌ హీరోయిన్‌గా కెరీర్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టాల్సిందే అంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.