Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇటీవలే ‘పైసా వసూల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు పూరి జగన్నాధ్ తర్వాత సినిమాను అప్పుడే మొదలు పెట్టాడు. కొన్ని వారాల క్రితమే తన కొడుకును హీరోగా పెట్టి ‘మహబూబా’ అనే చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి అప్పుడే రెగ్యులర్ షూటింగ్‌ను పూరి ప్రారంభించాడు. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా దేశం బోర్డర్‌లో మరియు కొంత పార్ట్ పాకిస్తాన్‌లో చేయబోతున్న విషయం తెల్సిందే. పాకిస్తాన్‌లో షూటింగ్‌ను తర్వాత షెడ్యూల్లో పెట్టుకున్న పూరి జగన్నాధ్ ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని హిమాచల్ ప్రదేశ్‌లో చిత్రీకరణ జరపుతున్నారు.
ఈ విషయాన్ని ఆకాష్ పూరి స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. హీరో ఆకాష్ పూరితో పాటు హీరోయిన్ కూడా ఈ షెడ్యూల్‌లో పాలుపంచుకోబోతుంది. ఇక ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్‌గా ఛార్మి వ్యవహరించబోతుంది. సినిమాకు కావాల్సిన అన్ని విషయాలను ఆమె దగ్గర ఉండి చూసుకుంటుంది. అందుకే ఇప్పుడు ఛార్మి కూడా హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లింది. అక్కడ చిత్ర యూనిట్ సభ్యులు చాలా భయంకరమైన వాతావరణంలో చిత్రీకరణ జరుపుతున్నారు. ఆర్మీ క్యాంపుల వద్ద ప్రత్యేక అనుమతి తీసుకుని మరీ దర్శకుడు పూరి జగన్నాధ్ చిత్రీకరణ జరుపుతున్నాడు.
ఒక ఇండియన్ కుర్రాడు, పాకిస్తాన్ అమ్మాయిల మద్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ చివరకు ఎలాంటి మలుపులు తిరిగి, ఎటు ప్రయాణించింది అనే విషయాలతో దర్శకుడు పూరి ఈ కథను తయారు చేశాడు. తన గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా పూర్తి విభిన్నంగా ఉంటుందని, నేను మారి ఈ కథ రాశాను అంటూ పూరి చెప్పుకొచ్చాడు. దాంతో అంచనాలు మరింతగా పెరిగాయి. వచ్చే సంవత్సరం ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి.