Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తాజాగా బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే. ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్న ఆ సినిమా పూరి స్థాయిని పెంచిదని చెప్పుకోవచ్చు. ఇక పూరి తన తర్వాత సినిమాను కొత్తవారితో తీయబోతున్నట్లుగా అనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు పూరి తర్వాత సినిమా కొడుకుతో ఉంటుందని అంతా భావించారు. అయితే కొత్త నటీనటులు కావాలి అంటూ ప్రకటించాడు.
కాస్టింగ్‌కాల్ అంటూ పూరి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 18 నుండి 25 ఏళ్ల కుర్రాళ్లను, అమ్మాయిలను హీరో పాత్రకు, హీరోయిన్ పాత్రకు ఎంపిక చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇంకా ముఖ్య నటీనటుల పాత్రకు కూడా కాస్టింగ్ కాల్‌ను పూరి కనెక్ట్ సంస్థ ప్రకటించింది. ఈ ఎంపిక పక్రియను హీరోయిన్ ఛార్మి చూసుకోనుంది. త్వరలో పూరి ప్రారంభించబోతున్న సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతుందని చెబుతున్నారు. అయితే అది పూరి తనయుడు ఆకాష్ సినిమా అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఛార్మిని పూరి ఫుల్‌గా వాడేస్తున్నాడని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.