Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రెండు వారాల క్రితం టీవీ9కు ఇంటర్వ్యూ ఇస్తూ ధనుష్ మద్యలో మైక్ పీకేసి వెళ్లి పోయాడు. యాంకర్ సుచిలీక్స్ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ధనుష్ అలా వెళ్లి పోయాడు. ఆ ఇంటర్వ్యూకు విపరీతమైన క్రేజ్ దక్కింది. టీవీ9కు ఆ ఇంటర్వ్యూ కారణంగా భారీ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అదే మాదిరిగా కాస్త అటు ఇటుగా రానా కూడా యాంకర్‌పై సీరియస్ అయినట్లుగా టీవీ9 ప్రోమో వదలడం జరిగింది. టీవీ9 ప్రోమోతో అంతా షాక్ అయ్యారు. డ్రగ్స్ విషయాన్ని ప్రస్తావించగానే రానా సీరియస్ అయ్యి, యాంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా టీజర్‌లో చూపించారు. అయితే అదంతా కూడా పబ్లిసిటీ స్టంట్ అని తేలిపోయింది.
ఇంటర్వ్యూలో అలాంటివి ఏమీ లేదు. పూర్తి ఇంటర్వ్యూ చూడని వారు ఇంకా కూడా కొందరు రానా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. యాంకర్‌పై రానా సీరియస్ అయ్యాడు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్వయంగా రానా క్లారిటీ ఇచ్చాడు. యాంకర్ తనపై కోపంను నటించమంటే అలా నటించాను తప్ప మరేం లేదు అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. డ్రగ్స్ విషయాన్ని యాంకర్ ప్రస్థావించిన సమయంలో రానా ఏమాత్రం నొచ్చుకోకుండా కూల్‌గా సమాధానం చెప్పాడు. కాని టీవీ9 మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించేందుకు కాస్త అతి చేసిందని చెప్పుకోవచ్చు.
మరిన్ని వార్తలు: