శ్రీరెడ్డి, లారెన్స్‌ రాజీ కుదిరిందా…?

Raghava Lawrence Open Challenge To Sri Reddy

టాలీవుడ్‌ను తన వ్యాఖ్యలతో కుదుపు కుదిపేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమలో బిజీ అయ్యింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురిపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తమిళ సినిమా పరిశ్రమకు చెందిన మురుగదాస్‌, లారెన్స్‌తో పాటు మరికొందరిపై కూడా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. తమిళంలో ఈమె ఆరోపణలు పీక్స్‌కు చేరిన సమయంలోనే అక్కడ నుండి ఛాన్స్‌ రావడం జరిగింది. దాంతో తమిళ సినీ ప్రముఖులు శ్రీరెడ్డి నోరు మూయించేందుకు ఆఫర్ల వల వేసినట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. తమిళ సినిమా పరిశ్రమలో ఈమెకు అవకాశం వచ్చినప్పటి నుండి అక్కడి వారి గురించి మాట్లాడలేదు. పైగా గతంలో లారెన్స్‌ పై సంచలన ఆరోపణలు చేసి, ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్లింది.

larence

లారెన్స్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఒక చిత్రంలో శ్రీరెడ్డికి ఛాన్స్‌ దక్కింది. స్వయంగా ఈ విషయాన్ని ఆమె ప్రకటించింది. ఫేస్‌బుక్‌ ద్వారా శ్రీరెడ్డి స్పందిస్తూ… నేను లారెన్స్‌ గారి ఇంటికి వెళ్లాను, ఆయన చాలా బాగా రిసీవ్‌ చేసుకున్నారు. ఆ ఇంట్లో ఎంతో మంది పిల్లలున్నారు. ఆ పిల్లలంతా కూడా నాకు మంచి జరగాలని కోరుకుంటామన్నారు. లారెన్స్‌ గారి ఇంట్లో ఆయన తదుపరి చిత్రం కోసం ఆడిషన్స్‌ జరిగాయి. ఆ ఆడిషన్స్‌లో నేను పాల్గొన్నాను. నాకు లారెన్స్‌ గారు ఛాన్స్‌ ఇవ్వడం తో పాటు అడ్వాన్స్‌ను కూడా ఇచ్చినట్లుగా పేర్కొంది. మొన్నటికి మొన్న లారెన్స్‌పై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్లడంతో రాజీ కుదిరిందనే ప్రచారం జరుగుతుంది.

Raghava-Lawrence-Open-Chall