Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో తడబడుతూ నెటిజన్ల చేతికి చిక్కుతున్నారు. కొన్నిరోజుల క్రితం కర్నాటకలో ఓ కార్యక్రమం ప్రారంభించటానికి వచ్చి ఇందిర క్యాంటిన్లకు బదులు అమ్మ క్యాంటిన్లు అన్న రాహుల్ గాంధీపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయనకు సంబంధించిన మరో వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. రెండు వారాల అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ కాలిఫోర్నియాలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
ఈ ప్రసంగంలోనే రాహుల్ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన అభ్యర్థిని తానే అని స్పష్టంచేశారు. ఈ సమయంలోనే ఆయన పొరపాటున లోక్ సభ స్థానాలు 545 అనబోయి…546 అన్నారు. ఇంకేముంది…ఆ విషయాన్ని పట్టుకుని నెటిజన్లు రాహుల్ పై జోకులు పేలుస్తున్నారు. లోక్ సభ ఎంపీగా ఉంటూ ఆ సభలో ఎంతముంది సభ్యులుంటారో తెలియని రాహుల్ ప్రధానమంత్రి ఎలా అవుతారూ అంటూ కొందరు నెటిజన్లుప్రశ్నిస్తున్నారు. లోక్ సభలో 546 మంది సభ్యులుంటారని ప్రధాని కావాలని ఆశపడుతున్న రాహుల్ చెబుతున్నారు.
ఈ సంఖ్య 545 నుంచి 546కు ఎప్పుడు మారింది అంటూ కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. రాహుల్ 546 అని చెబుతోన్న వీడియోను షేర్ చేసుకుంటూ నెటిజన్లు ఈ కామెంట్లు చేస్తున్నారు. ఇదే కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఓ యువతిని నోర్మూసుకో అని గట్టిగా కోప్పడుతున్న దృశ్యం కూడా ఉంది. అయితే ఆ యువతి రాహుల్ ఆగ్రహం చూసి వెనక్కి తగ్గలేదు. మీ అధికప్రసంగమేంటి? అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుణ్ని ఎదురు ప్రశ్నించింది. దీనిపైనా నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.
మరిన్ని వార్తలు: