Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ పదేళ్లపాటు అధికారంలో ఉండి ఓఢిపోవడానికి ప్రధాన కారణం అవినీతి. ఆకాశం నుంచి భూగర్భం వరకు అన్నింటిలోనూ అవినీతి జరిగిందన్న బీజేపీ ప్రచారం పనిచేసింది. దీనికి తోడు స్కాములు బయటపడటం కాంగ్రెస్ కొంప ముంచింది.
అయితే గత చేదు అనుభవాలను పక్కనపెడుతున్న రాహుల్.. పొత్తుల పేరుతో అవినీతిపరులకు దగ్గరవుతుండటం మోడీకి ఢోకా లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూపీలో అఖిలేష్, తమిళనాడులో స్టాలిన్, కనిమొళి, బీహార్లో తేజస్వి యాదవ్.. ఇలా ఎవర్ని చూసిన రాహుల్ ఫ్రెండ్సంతా బ్యాడ్ గానే ఉన్నారు.
స్వయంగా రాహుల్ మీదే నేషనల్ హెరాల్డ్ కేసు నడుస్తోంది. ఇలాంటి సమయంలో రాహుల్ నీతిమంతుల్ని పక్కనపెట్టి.. అవినీతి వెంట నడవడంపై క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాహుల్ పనితీరు చూస్తుంటే.. అధికారాన్ని మోడీకి వెండిపళ్లెంలో అప్పజెప్పేలా ఉన్నారని కార్యకర్తలు భయపడుతున్నారు.
మరిన్ని వార్తలు: