నాగ్, రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం మన్మథుడు 2. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, సమంత అతిధి పాత్రలలో కనిపించనున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదల చేశారు. ఇందులో పెళ్ళికాని మధ్య వయస్కుడిగా నాగ్ నటన అభిమానులని ఆకట్టుకుంది. డైలాగ్స్ కూడా ఫన్నీగా ఉన్నాయి. అయితే టీజర్లో కథానాయికగా నటిస్తున్న రకుల్‌ని చూపించకపోయే సరికి అభిమానులు నిరాశ చెందారు. రాహుల్ రవీంద్రన్‌కి ట్వీట్ చేశారు. దీనిపై క్లారిటీ ఇచ్చిన రాహుల్.. టీజర్లో రకుల్‌ని చూపించకపోవడానికి కారణం ఆమె కోసం సపరేట్గా ఓ టీజర్ కట్ చేశాం. అందుకే రకుల్‌ని టీజర్లో చూపించలేదు అని తెలిపారు. అన్నట్టుగానే రకుల్‌కి సంబంధించి ప్రోమో వీడియో విడుదల చేశారు. అవంతిక పాత్రలో రకుల్ కనిపించనుండగా, ఆమె పాత్ర చల్లగా ఉంటూనే హీటెక్కించనున్నట్టు తెలుస్తుంది.
మన్మథుడు 2 చిత్రం ఆగస్ట్ 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. రావు రమేశ్, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్, దేవదర్శిణి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయ్‌కామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున స్వయంగా జెమిని కిరణ్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా పని చేస్తున్నారు. ఫన్ రైడ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్9న విడుదల చేయనున్నారు.