చిన్న చిత్రాల హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి అతి తక్కువ సమయంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించేసి లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. రెండు సంవత్సరాల పాటు రకుల్ ప్రీత్‌సింగ్ డేట్ల కోసం స్టార్ హీరోలు సైతం ఎదురు చూసిన సందర్బాలు ఉన్నాయి. ఎంత స్పీడ్‌గా క్రేజ్ దక్కిందో అంతే స్పీడ్‌గా రకుల్ క్రేజ్ తగ్గిపోయింది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్‌సింగ్ అతి తక్కువ సమయంలోనే అస్సలు అవకాశాలు లేకుండా పోయింది. స్టార్ హీరోలతో నటించే ఛాన్స్‌లు రాకపోవడంతో రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అవకాశాల కోసం వెదుక్కునే పరిస్థితి వచ్చింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడటం జరిగింది. తన కెరీర్‌లో పలు సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్బాలు ఉన్నాయి. అదే సమయంలో ఆ ఇబ్బందులను అదిగమించి సక్సెస్‌లను దక్కించుకున్నాను. ఇప్పుడు కూడా నేను మళ్లీ సక్సెస్ అవుతాను అంటూ చెప్పుకొచ్చింది. ఎప్పుడైతే ప్రేక్షకులకు నేను బోర్ కొట్టాను అని ఫీల్ అవుతారో అప్పుడు నేనే స్వయంగా సినిమాల నుండి వెళ్లి పోతాను అంటూ చెప్పుకొచ్చింది. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో ఈ అమ్మడు కోలీవుడ్‌లో ప్రయత్నాలు చేస్తోంది. అక్కడా కూడా అడపా దడపా అవకాశాలు మినహా పెద్దగా దక్కడం లేదు. ప్రేక్షకులకు ఏమో కాని, సినీ వర్గాల వారికి మాత్రం రకుల్ వెంటనే బోర్ కొట్టేసింది. ఆ విషయాన్ని తెలుసుకుని ఆమె మెల్లగా సినిమాల నుండి సైడ్ అయిపోతే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.