టాలీవుడ్లో దాదాపు యువ స్టార్ హీరోల అందరితో కూడా కలిసి నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. సహజంగా హీరోయిన్ల కెరీర్ స్పాన్ తక్కువ ఉంటుందని తెల్సిందే. కాని రకుల్ ప్రీత్ సింగ్ మరీ తక్కువగా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ మూడు సంవత్సరాలు కూడా స్టార్ హీరోయిన్గా కొనసాగలేదు. వరుసగా చిత్రాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు చేతిలో సినిమాలు లేక ఢీలా పడిపోయింది. స్టార్ హీరోలతో కాకున్నా చిన్న హీరోలతో అయినా అవకాశాలు వస్తాయేమో అని ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కాని ఫలితం లేకుండా పోయింది.
తెలుగు మరియు తమిళంలో ఈమె తనకున్న పరిచయాలతో మళ్లీ బిజీ అవ్వాలనే ప్రయత్నాలు చేస్తోంది. అందకోసం భారీగా పారితోషికం కూడా తగ్గించుకుంది. అయినా కూడా ఈమెకు ఆఫర్లు రావడం లేదు. గతంలో కోటికి పైగా పారితోషికం అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం 50 నుండి 60 లక్షల వరకు సినిమా చేసేందుకు ఓకే చెబుతుంది. అయినా కూడా ఈమెకు ఛాన్స్‌లు రావడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఒక చిత్రంకు సైన్ చేసింది. అయితే ఆ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కేతుందనే విషయంపై క్లారిటీ లేదు. అసలు ఆ చిత్రం మొదలు అవుతుందా లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈసమయంలో రకుల్‌కు ఒక భారీ విజయం కావాల్సి ఉంది. మరి ఆ విజయం ఎవరు ఈమెకు ఇస్తారో చూడాలి.