Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంను ఈనెల 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోతున్నారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమంకు చిత్ర యూనిట్ సభ్యులు బహిరంగ సభ అంటూ పేరు పెట్టారు. మహేష్‌బాబు ఈ చిత్రంలో సీఎం భరత్‌గా కనిపించబోతున్నాడు. అందుకే సీఎం భరత్ బహిరంగ సభ అంటూ ఆడియో వేడుకను ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ ఆడియో వేడుకలో ఎన్టీఆర్ మరియు తారక్‌లు పాల్గొనే అవకాశం ఉందని గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ సభ్యులు స్పందిస్తు మీడియాలో వస్తున్న వార్తల వల్ల సినిమా ఆడియో వేడుకకు భారీ క్రేజ్ ఏర్పడటం జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులమైన మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మహేష్‌బాబు సినిమా ఆడియో వేడుకకు ఎన్టీఆర్, చరణ్‌లు అతిథులు అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ విషయమై ఇప్పుడే తాను ఏం చేప్పలేను అంటూ దర్శకుడికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి చెప్పుకొచ్చాడు. దాంతో భరత్ బహిరంగ సభకు ఎన్టీఆర్, తారక్‌లు వచ్చే విషయమై సస్పెన్స్ కొనసాగుతుంది. 7వ తారీకు వరకు ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉందేమో. ఈనెల 20న భరత్ అను నేను ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.