Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా ఫ్యామిలీలో విభేదాలున్నాయని, పవన్‌ను ఇతర మెగా ఫ్యామిలీ దూరంగా ఉంచుతుందని కొంత కాలం క్రితం వరకు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, ఫ్యామిలీ అంతా కలిసే ఉందని మెగా ప్యామిలీ సభ్యులు చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బలోపేతంకు నడుం భిగించాడు. అందుకోసం తెలంగాణలో యాత్రను నిర్వహిస్తున్నాడు.
పవన్ చేపట్టిన ఈ రాజకీయ యాత్రకు రామ్ చరణ్ తన వంతు బాధ్యతగా మద్దతు పలికాడు. ఫేస్‌బుక్ ద్వారా బాబాయి పవన్ కళ్యాణ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పడంతో పాటు, జై జనసేన అంటూ స్లోగన్ ఇవ్వడంతో 2019 ఎన్నికల్లో జనసేన తరపున చరణ్ ప్రచారం చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.ఏపీ మరియు తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలి అని భావిస్తున్న పవన్ కళ్యాణ్‌కు మెగా హీరోల మద్దతు ఖచ్చితంగా అవసరం.
చరణ్, బన్నీలు ప్రచారం చేయడం వల్ల జనసేన పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందని సినీ మరియు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ యాత్ర సందర్బంగా ఆల్ ది బెస్ట్ చెప్పి జై జనసేన అనడం ద్వారా బాబాయి వెంటే తాను అనే విషయాన్ని చరణ్ చెప్పకనే చెప్పాడు. జనసేన పార్టీకి చిరంజీవికి సంబంధం లేదు అంటూ పవన్ చెప్పిన కొన్ని గంటల్లోనే చరణ్ ఈ ఫేస్‌బుక్ పోస్ట్ చేయడంతో బాబాయి పార్టీకి తాను మద్దతుగా నిలుస్తాను అని, పార్టీకి బయట ఉండి మద్దతు తెలుపుతాను అని చెప్పకనే చెప్పాడు.