Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల వర్మ గత కొన్ని రోజులుగా డ్రగ్స్ విషయంలో పదే పదే స్పందిస్తూ ఉన్నాడు. డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులను టార్గెట్ చేశారు అంటూ వర్మ సిట్ అధికారులను ఉద్దేశించి వర్మ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆ వ్యాఖ్యలను సిట్ అధికారులు కొట్టి పారేశారు. తమకు ఎవరు శత్రువులు కాదు, మిత్రులు కాదు అంటూ తేల్చి చెప్పారు. ఆ సమయంలోనే వర్మ డ్రగ్స్‌ను అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మాలని, అలా అమ్మితే మంచి ఆధాయం వస్తుందంటూ చెప్పుకొచ్చాడు. ఇక తెలంగాణకు చెందిన అధికారులు మరియు సినీ ప్రముఖులు యాంటీ డ్రగ్స్ ర్యాలీని నిర్వహించిన విషయం తెల్సిందే. ఆ ర్యాలీపై కూడా వర్మ తనదైన స్టైల్లో విరుచుకు పడ్డాడు.
50 సంవత్సరాలుగా సిగరెట్లు తాగవద్దు, మద్య పానం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఏ ఒక్కరు అయినా సిగరెట్లు తాగడం మానేశారా, మద్యపానం వదిలేశారా. ఇప్పుడు ఒక్కరోజు యాంటీ డ్రగ్స్ ర్యాలీ చేయగానే డ్రగ్స్‌ను తీసుకునే వారు వదిలేస్తారా. ఆ విషయాన్ని ర్యాలీలో పాల్గొన్న వారు ఒక్కరైనా నమ్ముతారా, ఈ ర్యాలీ వల్ల డ్రగ్స్ తీసుకునే వారు తగ్గుతారు అని ర్యాలీలో పాల్గొన్న వారు నమ్మకంగా చెప్పగలరా అంటూ వర్మ ప్రశ్నించాడు. ర్యాలీలో పాల్గొనని వారు డ్రగ్స్ తీసుకున్నట్లుగా సిట్ అధికారులు భావించి, విచారణకు పిలుస్తారా ఏంటి అంటూ ఎద్దేవ చేశాడు. ర్యాలీలో పాల్గొన వారిలో కూడా కొందరు డ్రగ్స్ తీసుకున్న వారు ఉండి ఉండవచ్చు అంటూ వర్మ అనుమానం వ్యక్తం చేశాడు. ఏదో డ్రగ్స్ నిర్మూలణకు ప్రయత్నాలు చేస్తుంటే వర్మ ఇలా విమర్శించడం ఏమాత్రం భావ్యం కాదని కొందరు అంటున్నారు. వర్మ ఇలాంటి కామెంట్స్, వ్యాఖ్యలు చేయడం కొత్తేం కాదు కాబట్టి కొందరు ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదు.
మరిన్ని వార్తలు: