Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వంగవీటిరంగాపై గౌతమ్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో విజయవాడ ఓ వైపు అట్టుడుకుతోంటే… వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ గొడవను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా ఉన్నాయి. తన కుమారుడు, భార్యను చూసి వంగవీటి రంగా ఎంతో గర్వపడుతుంటారని, స్వర్గంలో బ్రేక్ డ్యాన్స్ కూడా చేస్తుంటారని ఫేస్ బుక్ లో కామెంట్ చేశారు వర్మ. తనకు కూడా రంగా భార్య, కుమారుడు అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. అంతటితో ఆగకుండా వంగవీటి రత్నకుమారి నల్లగా, కుమారుడు రాధ తెల్లగా ఎందుకున్నారో ప్రముఖ కాస్మోటిక్స్ సంస్థ లోరియల్ చెప్పాలంటూ వర్మ వివాదస్పదంగా వ్యాఖ్యానించారు.
వాటితో పాటు పోలీస్ స్టేషన్ లో రత్నకుమారి, రాధ నేలపై కూర్చున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. వర్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు తాజా వివాదంపై రాధ ఆగ్రహం వ్యక్తంచేశారు. రంగాను విమర్శించే స్థాయి గౌతంరెడ్డికి లేదని, ఆయనకు రంగా అభిమానులే సమాధానం చెబుతారని రాధ అన్నారు. చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం తగదన్నారు. గౌతంరెడ్డి వామపక్షాలను అడ్డంపెట్టుకుని కోట్లు సంపాదించారని, ఇసుక మాఫియాతో అతనికి సంబంధాలున్నాయని రాధ విమర్శించారు.
వంగవీటి రాధాకు, గౌతమ్ రెడ్డికి మధ్య కొన్నాళ్లుగా విభేదాలున్నాయి. ఓ టీవీ చానల్ ముఖాముఖిలో పాల్గొన్న గౌతంరెడ్డి వంగవీటి రంగా హత్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగాను చంపటం దారుణం కాదన్న గౌతంరెడ్డి ఒక పాము దారిలో దొరికిన వ్యక్తినల్లా కాటేస్తూ చంపూతూ…ఓ చోటుకు వెళ్లాక దేవుడి ఫొటో వెనక దాక్కుంటే…జనం దాన్ని బయటికి లాగి చంపుతారా లేక…ఫొటో వెనక ఉందని వదిలేస్తారా…అని ప్రశ్నించారు. నిరాహారదీక్షలో ఉన్నా…ఎక్కడున్నా…రౌడీ రాజకీయాలే పరమావధిగా భావించి అడుగులు ముందుకు వేసిన వాళ్ల భవిష్యత్తు పోస్ట్ మార్టంకు వెళ్లటమే అని గౌతంరెడ్డి వ్యాఖ్యానించారు. ఆ చానల్ గౌతంరెడ్డి వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసింది. దీంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.
గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ వంగవీటి అభిమానులు, అనుచురులు ఆందోళనకు దిగారు. గౌతంరెడ్డి ఇంటికి సమీపంలో ప్రెస్ మీట్ నిర్వహించేందుకు రాధ సమాయత్తమవటంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు రాధను, ఆయన తల్లి రత్నకుమారిని గృహనిర్బంధంలో ఉంచారు. రాధ అనుచరులు పెద్ద ఎత్తున గొడవకు దిగటంతో వారిద్దరినీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు . రాధ, రత్నకుమారి స్టేషన్ లో నేలపై కూర్చుని నిరసన వ్యక్తంచేశారు. రెండు గంటల తర్వాత పోలీసులు వారిని వదిలిపెట్టారు. అటు వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధక్షుడిగా ఉన్న గౌతంరెడ్డిని ఈ గొడవ నేపథ్యంంలో జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
మరిన్ని వార్తలు:
ఆ ఏడు రాష్ట్రాలు వద్దా మోడీ..?
నితీష్ పై పగ తీర్చుకున్న మోడీ
యోగికి ఆరెస్సెస్ క్లాస్