Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ చిత్రం నేడు విడుదలైంది. ఒక ఫీచర్ ఫిల్మ్ రేంజ్లో దర్శకుడు వర్మ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంతో అందరి దృష్టి ఆకర్షించాడు. ఒక షార్ట్ ఫిల్మ్‌కు గతంలో ఎప్పుడు లేనంతగా పబ్లిసిటీ దక్కింది. వర్మ ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఒక పోర్న్ సైట్లో పోస్ట్ చేయించాడు. వర్మ చేసిన పబ్లిసిటీతో ఈ చిత్రాన్ని చూడాలనుకున్న వారు 150 రూపాయలు చెల్లించాలని చెప్పినా కూడా విపరీతమైన వ్యూస్ వస్తూ ఉన్నాయి. ఒక ఆన్లైన్ పోర్టల్‌తో ఒప్పందం చేసుకున్న వర్మ భారీ మొత్తంలో వారి నుండి డబ్బును పొందినట్లుగా తెలుస్తోంది. ఆ సైట్ వారు కూడా సినిమా చూడాలి అంటే 150 రూపాయలు చెల్లించాల్సిందే అంటూ కండీషన్ పెట్టిన నేపథ్యంలో లక్షల్లో డబ్బు జమ అవుతుంది.
ఉదయం 9 గంటల సమయంలో వర్మ జీఎస్టీ విడుదలైంది. కేవలం గంట సమయంలోనే ఏకంగా రెండు లక్షల మంది జీఎస్టీ కోసం వెదికారు. ఆ సంఖ్య పెరిగి పోతూనే ఉంది. కొందరు 150 రూపాయలు చెల్లించేందుకు ఇష్టం లేక వదిలేశారు. ఇన్నాళ్లు సినిమా గురించి విపరీతంగా పబ్లిసిటీ చేసి ఇప్పుడు సినిమా చూడాలి అంటే 150 రూపాయలు చెల్లించాలి అంటూ వర్మ పెట్టిన మెలికతో అంతా కూడా షాక్ తిన్నారు. సినిమాను డబ్బులు చెల్లించి చూడాలి అనే విషయాన్ని వర్మ రెండు రోజుల క్రితమే చెప్పాడు. కాని ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఏమైనా వర్మ తెరకెక్కించిన ‘జీఎస్టీ’లో ఏముందనే ఆలోచించారు. మొత్తానికి వర్మ జీఎస్టీతో భారీగా లాభపడటం ఖాయంగా కనిపిస్తోంది. డబ్బులపై ఆశ లేదంటూనే వర్మ ఎంత బిజినెస్ మైండ్‌తో ఆలోచించాడు అంటూ కొందరు అంటున్నారు. మరి కొందరు మూడు నాలుగు రోజుల్లో సినిమా పైరసీ వచ్చేస్తుంది, అప్పుడు చూసేయొచ్చు అంటూ ఎదురు చూస్తున్నారు.