ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం పాజిటివ్ టాక్‌ను దక్కించుకుని భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకు వెళ్తుంది. కార్తికేయ మరియు పాయల్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం యూత్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. హీరోయిన్లో ఉన్న నెగటివ్ షేడ్స్‌ను చక్కగా చూపించడంతో పాటు, క్లైమాక్స్‌లో హీరో మృతి చెందినా కూడా ప్రేక్షకులను ఒప్పించడం అనేది తెలుగు సినిమాల్లో చాలా అరుదు. తెలుగు సినిమాల్లో హీరో చనిపోతే ప్రేక్షకులు ఒప్పుకోరు. కాని ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ప్రేక్షకులను మెప్పించి, ఒప్పించాడు. దర్శకుడు అజయ్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఈయన గతంలో వర్మకు పలు చిత్రాల్లో శిష్యుడిగా చేశాడు.
తన శిష్యుడు అజయ్ భూపతి చేసిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంపై వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమా చూసిన వర్మ అభినందనలు తెలియజేయడంతో పాటు సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించాడు. నా వద్ద అసిస్టెంట్‌గా చేసిన అజయ్ భూపతిని కలిసి ఇప్పుడు ఆయన వద్ద అసిస్టెంట్‌గా చేయాలని కోరుకుంటున్నాను అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. వర్మ ఇలా అతిగా స్పందించడం చాలా కామన్. అయితే ఈసారి అజయ్ భూపతిపై వర్మ చేసిన కామెంట్స్ ఆ సినిమా స్థాయిని మరింతగా పెంచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వర్మ శిష్యులు ఈమద్య అంతగా సక్సెస్ కాలేక పోతున్నారు. ఈ సమయంలో అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100తో విజయాన్ని దక్కించుకుని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు.