Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా తీయబోతున్నట్టు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్ గొప్పదనాన్ని, ఎన్టీఆర్ సినిమాతో తనకున్న అనుభూతుల్ని పంచుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య హీరో అని , విష్ణు నిర్మాత కావొచ్చని నిన్నే తెలుగు బులెట్ తెలియజేసింది. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ మీద వర్మ ఇచ్చిన ప్రకటన మీ కోసం…
ఎన్టీఆర్ బయోపిక్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అధికారికంగా నేడు ప్రకటించారు.. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటనలో..తెలుగువాడిని మొట్టమొదటిసారిగా తలత్తెకునేలా చేసింది NTR అనబడే మూడు అక్షరాలు. ఆ పేరు వింటే చాలు తెలుగువాడి ఛాతి గర్వంతో పొంగిపోతుంది, స్వాభిమానం తన్నుకొస్తుంది. ఆయన ఒక మహానటుడే కాదు,మొత్తం తెలుగు నేల ఆయనకు ముందు, ఆయన తర్వాత కూడా చూడని అత్యధిక ప్రజాదరణ కలిగిన మహా రాజకీయ నాయకుడు.
నాకు ఆయనతో పర్సనల్ గా వున్న అనుబంధం ఏమిటంటే ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అడవి రాముడు సినిమా చూడటానికి 23 సార్లు బస్ టికెట్ కి డబ్బుల్లేక 10 కిమీ దూరం కాలి నడకన వెళ్లేవాడిని. అంతే కాకుండా ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ అనౌన్స్ చేసిన మొదటి మహానాడు మీటింగులో నేల ఈనినట్టు వచ్చిన లక్షలాది మందిలో నేనూ వున్నాను ..అలాంటి అతి మామూలు నేను… ఇప్పుడు ఎన్టీఆర్ జీవితాన్నే ఒక బయోపిక్ గా తెరకు ఎక్కించడం చాలా చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ అత్యంత నిజమైన ఆ మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన శత్రువులెవరో ,నమ్మక ద్రోహులెవరో,ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలేమిటో అవన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ఎన్టీఆర్ చిత్రం లో చూపిస్తాను. “ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అని రాయప్రోలు గారంటే, నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ కెపాసిటీలో కాకుండా 8 కోట్ల తెలుగు వాళ్లలో కేవలం ఒకడిగా ప్రపంచంలో వున్న ప్రతి తెలుగువాడికి చెప్పేది ..ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి ఎంటీయారుని.
… రామ్ గోపాల్ వర్మ.
మరిన్ని వార్తలు
బాలయ్యకు అస్వస్థత
రామాయణంపై పడ్డ వర్మ