Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘నేను శైలజ’ చిత్రం తర్వాత రామ్‌కు పెద్దగా ఏ సినిమా కూడా కలిసి రాలేదు. అయినా కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా రామ్ చేసిన చిత్రం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’. ఈ చిత్రానికి ‘నేను శైలజ’ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు కిషోర్ తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తుంటేనే అనిపిస్తుంది. సైలెంట్‌గా రెడీ అయిన ఈ సినిమాలో రామ్ రెండు లుక్స్‌తో కనిపిస్తున్నాడు. దాంతో సినిమాపై అంచనాలు, ఆసక్తి పెరుగుతుంది.
రామ్ ద్విపాత్రాభినయం చేశాడా లేదా ఒకే పాత్ర రెండు వేరియేషన్స్‌లో ఉంటుందా అనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. టైటిల్ ఆకట్టుకోవడంతో పాటు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వారంలోనే సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. తాజాగా సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలకు క్లీన్ యూ రావడం చాలా అరుదు. ఈ చిత్రానికి రావడం వింతగా చెప్పుకోవాల్సిందే. రామ్ ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నాడు. మరో సక్సెస్ తనకు కిషోర్ తిరుమల ద్వారా వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నాడు.
రామ్‌కు జోడీగా ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ మరియు లావణ్య త్రిపాఠిలు నటించారు. అనుపమ పాత్ర సినిమాకు హైలైట్‌గా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. ఆమె గతంలో పోషించిన పాత్రలతో పోల్చితే ఈ పాత్ర అద్బుతంగా వచ్చిందని, ఆమెకు ఈ పాత్రతో టాలీవుడ్లో టర్నింగ్ పాయింట్ అవుతుందని దర్శకుడు అంటున్నాడు. ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. ఈనెల 27న ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్నేహం గురించి ఉన్న పాటల, సీన్స్ యూత్‌ను ఆకట్టుకుంటాయని దర్శకుడు భావిస్తున్నాడు.