Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రానా హీరోగా కాజల్ హీరోయిన్గా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం భారీ విజయం దిశగా దూసుకు పోతుంది. కేవలం 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు 25 కోట్ల షేర్‌ను రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు, ఈ వారంలో పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలు లేని కారణంగా మరో వారం రోజులు కూడా ఈ చిత్రం సందడి సాగడం ఖాయం. లాంగ్ రన్లో ఈ చిత్రం 35 కోట్లకు ఎక్కువగా వసూళ్లు చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఈ చిత్రం సూపర్ హిట్ అయిన నేపథ్యంలో శాటిలైట్ రైట్స్ కూడా భారీగానే ధర పలికే అవకాశం ఉంది.
సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమా దాదాపుగా 30 కోట్ల లాభాలను తెచ్చి పెట్టడం ఖాయం అని సినీ వర్గాల్లో అంచనా. శాటిలైట్ రైట్స్ రూపంలో నిర్మాతకు 7 కోట్లు దక్కే అవకాశం ఉంది. ఇక ఆన్ లైన్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ రూపంలో మరింతగా ఈ మొత్తం ఉండబోతుంది. వచ్చే నెల మొదటి వారంలో తమిళం మరియు మలయాళంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ కూడా సక్సెస్ అయితే లాభాల సంఖ్య మరింతగా పెరగవచ్చు అనేది విశ్లేషకుల వాదన. మొత్తానికి గత వారం విడుదలైన చిత్రాల్లో రానా పై చేయి సాధించాడు. బోయపాటి శ్రీను పెట్టుబడిని రాబట్టి అంతో ఇంతో లాభాలను కూడా రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ‘లై’ చిత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలే అవకాశం కనిపిస్తుంది.
మరిన్ని వార్తలు: