Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగస్థలం’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. మొదట ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే పవన్ అజ్ఞాతవాసి విడుదలకు సిద్దంగా ఉన్న నేపథ్యంలో సినిమాను వాయిదా వేయడం జరిగింది. తాజాగా ‘రంగస్థలం’ చిత్రాన్ని పరీక్షలు పూర్తి అయిన తర్వాత అంటే మార్చి 29న విడుదల చేయాలని నిర్ణయించారు. తాజాగా అదే తేదీకి ‘మహానటి’ని విడుదల చేయబోతున్నట్లుగా అశ్వినీదత్ ప్రకటించాడు.
‘మహానటి’ కోసం తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా సినీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్యదైవం సావిత్రి జీవితంలో అసలేం జరిగింది, ఆమె చివరి రోజుల్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఎందుకు ఆమె జీవితం అర్థాంతరంగా ముగిసి పోయింది అనే విషయాలు తొసుకోవాలని అంతా కోరుకుంటున్నారు. అందుకే ‘మహానటి’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక రంగస్థలం చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అయితే ఏ చిత్రానికి నష్టం అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. రెండు చిత్రాలు కూడా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్నాయి కనుక రెండు సినిమాల కలెక్షన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓపెనింగ్ కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. అందుకే ఈ రెండు చిత్రాల విడుదల తేదీల్లో కనీసం మూడు రోజుల గ్యాప్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.