రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కించిన పీరియాడికల్ చిత్రం రంగస్థలం. విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాక బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. చెర్రీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంకి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. జగపతి బాబు ఆది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రలలో కనిపించి సందడి చేశారు. కన్నడలో డబ్ అయిన ఈ చిత్రం నేడు గ్రాండ్‌గా విడుదలైంది. కర్ణాటక రాష్ట్రంలో ఈ చిత్రాన్ని 85 స్క్రీన్స్‌లో విడుదల చేయగా, ఒక్క బెంగళూర్లోనే తొలి రోజు 26 షోస్ ప్రదర్శితమయ్యాయి. మైత్రిమూవీ మేకర్స్ మరియు జేఎమ్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రంగస్థళ పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్రం అక్కడ కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. కన్నడ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారు.
కన్నడ నాట కొన్ని దశాబ్ధాలుగా డబ్బింగ్ వర్షెన్ చిత్రాలు విడుదల కావడం లేదు. కాని కొద్ది రోజుల క్రితం విడుదలైన కన్నడ చిత్రం కేజీఎఫ్ ని అన్ని భాషలకి చెందిన ప్రేక్షకులు ఎంతగానో ఆదరించడంతో ఇప్పుడు వేరే భాషా చిత్రాలని డబ్ చేసి కన్నడలో రిలీజ్ చేసుకునేందుకు కన్నడ ఇండస్ట్రీ అనుమతినిచ్చింది. ఈ క్రమంలో కన్నడలోను చిట్టిబాబు మోత మోగించేందుకు సిద్ధమయ్యాడు. రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో కనిపించి సందడి చేస్తే సమంత రామలక్ష్మీ పాత్రలో కనువిందు చేసింది.