రంగస్థలం మరింత విస్తరించనుంది

Rangasthalam Movie dubbing other languages

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా పవర్ స్టార్ చరణ్ తన కెరీర్లో మగధీర తర్వాత అంతటి ఘన విజయం సాదించిన సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించగా దేవిశ్రీ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తమిల్ భాషలోకి డబ్బింగ్ చేస్తామని దర్శక నిర్మాతలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే 103కోట్ల షేర్ సాధించిన ఈ సినిమాని తమిళం లోనే కాకుండా హిందీ, మలయాళం, బొజ్ పురి భాషల్లోకి అనువదించే అవకాశాలున్నాయి.

ఈ విషయంపై దర్శకనిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాలో చరణ్ కి జంటగా స్టార్ హీరోయిన్ సమంత నటించింది. ఆది కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు నటించాడు. ఓవర్ సీస్ లో రికార్డ్ స్థాయి వసుల్లాను సాధించిన ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోకి అనువదిస్తే ఖచ్చితంగా మరిన్ని కలెక్షన్స్ రావడం ఖాయం అంటున్నారు.