Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మండే వేసవి కాలంలో జోరు వాన కురిస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎండ వేడికి తట్టుకోలేక పోతున్న వారిపై జోరు వాన కురిస్తే వేసవి తాపం తీరుతుంది. అలాగే గత మూడు నెలలుగా సినిమాలు ఒక్కటి కూడా సరిగా లేకపోవడంతో ఢీలా పడిపోయిన తెలుగు ప్రేక్షకులు ‘రంగస్థలం’ చిత్రం రాగానే ఫుల్ ఖుషీ అవుతున్నారు. రెగ్యులర్ తెలుగు సినిమాకు పూర్తి విభిన్నంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ కలెక్షన్స్ సాధిస్తుంది. కేవలం మూడు రోజుల్లో 90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి దుమ్ము రేపుతోంది. ఈ స్థాయి వసూళ్లు రాక నెలలు గడుస్తుంది. సినిమా థియేటర్ సిబ్బంది నుండి ప్రేక్షకుల వరకు అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్, సుకుమార్‌ల కాంబినేషన్లో పల్లెటూరు నేపథ్యం, అదీ 1980 కాలం నాటి కథ అనగానే అంతా కూడా అవాక్కయ్యారు. ప్రస్తుతం జనరేషన్‌కు ఇలాంటి కథలు ఎక్కవు అని భావించారు. కాని తెలుగు ప్రేక్షకుల నాడి తెలిసిన సుకుమార్ అద్బుతమైన స్క్రీన్‌ప్లే మరియు ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించి మెప్పించాడు. రంగస్థలం చిత్రం మొదటి వారం రోజుల్లోనే ఏకంగా 100 కోట్లను వసూళ్లు చేస్తుందని మొదటి నుండి అంటూ వచ్చారు. అయితే కేవలం మూడు రోజుల్లో ఈ చిత్రం 90 కోట్లను వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది. సమంత, అనసూయలతో పాటు జగపతిబాబు తన నటనతో సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి. మొత్తానికి ఇన్నాళ్ల ఎదురు చూపులకు రంగస్థలం ఫుల్స్టాప్ పెట్టిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.