ఒకరు హ్యాపీ.. ఇంకొక్కరు అన్‌హ్యాపీ

Rashi Kanna Movie Chances increased with Tholiprema
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద మెగా హీరోల ఫైట్‌ చాలా సీరియస్‌గా జరుగబోతుందని ఆశించారు. కాని సాయి ధరమ్‌ తేజ్‌ ‘ఇంటిలిజెంట్‌’ ఫ్లాప్‌ అవ్వడం, వరుణ్‌ తేజ్‌ ‘తొలిప్రేమ’ సక్సెస్‌ అవ్వడంతో రెండు చిత్రాల మద్య పోటీ అనేది లేకుండా పోయింది. ‘తొలిప్రేమ’ ముందు ఇంటిలిజెంట్‌ నిలువలేక పోయాడు. పోటీ పడటం పక్కన పెడితే రెండవ వారంలో కనీసం పది థియేటర్లలో కూడా ఉండే పరిస్థితి లేదు. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘ఇంటిలిజెంట్‌’ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఆ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న లావణ్య త్రిపాఠి ఆశలు అడియాశలు అయ్యాయి. ఇక ‘తొలిప్రేమ’ చిత్రంతో సక్సెస్‌ కోసం చాలా కష్టపడ్డ రాశిఖన్నాకు మాత్రం మంచి పేరు వచ్చింది. 

‘ఇంటిలిజెంట్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన లావణ్య త్రిపాఠికి పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు. కాని ‘తొలిప్రేమ’ చిత్రంలో రాశిఖన్నా పాత్రకు చాలా ప్రాముఖ్య ఉంది. దాంతో పాటు పాత్రకు తగ్గట్లుగా రాశిఖన్నా నటించి మెప్పించింది. పాత్ర కోసం రాశిఖన్నా బరువు తగ్గడంతో పాటు, గ్లామర్‌ షో చేయడం మరియు మంచి నటన కనబర్చడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తుంది. వరుణ్‌కు మంచి జంటగా రాశిఖన్నా మెప్పించిందనే టాక్‌ సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. 

‘తొలిప్రేమ’ ఫలితం తారు మారు అయితే రాశిఖన్నా సినీ కెరీర్‌ ప్రమాదంలో పడేది. కాని రాశిఖన్నా ఆ ప్రమాదం నుండి తప్పించుకుంది. మళ్లీ రాశిఖన్నాకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. అతి త్వరలోనే రాశిఖన్నా మరో స్టార్‌ హీరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొత్తానికి ఒక్క రోజు తేడాతో వచ్చిన రెండు చిత్రాలు ఒక హీరోయిన్‌కు సంతోషాన్ని, మరో హీరోయిన్‌కు దుఖ:ను ఇచ్చింది.