విలన్‌గా చేసేందుకు నాకెలాంటి ఇబ్బంది లేదు…!

Ravi Teja Acting On Villain Role

హీరోలు సీనియర్స్‌ అయిన తర్వాత విలన్స్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా మారడం ఇండస్ట్రీలో చాలా కామన్‌. అదే దారిలో రవితేజ కూడా విలన్‌ రోల్స్‌ను చేసేందుకు సిద్దం అంటూ ప్రకటించాడు. తాజాగా ఈయన నటించిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఈనెల 16న భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇలియానా నటించిన విషయం తెల్సిందే. ఇలియానా ఈ చిత్రంతో చాలా సంవత్సరాల తర్వాత టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. సినిమాకు ఈమె ప్లస్‌ అని కొందరు, ఈమె మైనస్‌ అంటూ కొందరు అంటున్నారు. ఇలాంటి సమయంలో ఇలియానా పాత్ర గురించి రవితేజ మాట్లాడుతూ తప్పకుండా ఈ సినిమాతో ఇలియానా తెలుగులో మళ్లీ బిజీ అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు.

amar-akbar-antony

ఇలియానా తమ సినిమాకు ప్లస్‌ అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు.ఇక కెరీర్‌ లో ఇంకా ఎంత కాలం హీరోగా నటిస్తానో తనకే తెలియదు అన్నాడు. అయితే సినిమా పరిశ్రమను మాత్రం వదలను. హీరోగా అవకాశాలు లేనప్పుడు విలన్‌గా కూడా నటిస్తాను. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణించేందుకు కూడా తాను కృషి చేస్తాను అన్నాడు. మంచి పాత్రలు వస్తే ఎలాంటి సినిమాల్లో అయినా ఎలాంటి హీరోలతో అయినా చేసేందుకు తాను సిద్దం అంటూ ప్రకటించాడు. ఇక తేరి చిత్రం రీమేక్‌ గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. తాను తేరి చిత్రాన్ని చేయడం లేదు అంటూ చెప్పేశాడు. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

vilan-raviteja