రవితేజ, ఇలియానా జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీస్ వారు నిర్మించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో రూపొంది 20 కోట్లకు అమ్ముడు పోయిన ఈ చిత్రం వసూళ్ల పరంగా చూస్తే మాత్రం చాలా దారుణమైన పరాజయం అని చెప్పుకోవాలి. చిత్ర డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రం వల్ల భారీగా నష్టపోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని అన్ని ఏరియాల్లో కలిపి దాదాపుగా 22 కోట్లకు అమ్మారని తెలుస్తోంది. ఈ ముగ్గురి కాంబినేషన్‌పై నమ్మకంతో పాటు మైత్రి మూవీస్ వారికి ఉన్న ట్రేడ్ రికార్డు కారణంగా భారీగా బిజినెస్ చేసింది.
సినిమా విడుదలైన రోజే ఫ్లాప్ టాక్ దక్కించుకున్న కారణంగా సినిమాకు భారీ నష్టం తప్పేలా లేదు. మొదటి రోజు కేవలం 3.8 కోట్ల షేర్‌ను దక్కించుకున్న ఈ చిత్రం లాంగ్ రన్‌లో కనీసం ఆరు కోట్ల షేర్‌ను దక్కించుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చిత్రానికి ట్యాక్సీవాలా చిత్రంతో గట్టి పోటీ ఎదురు అవుతుంది. ట్యాక్సీవాలాకు పాజిటివ్ టాక్ వచ్చిన కారణంగా ఈ చిత్రంను అంతగా ఆధరిస్తారనే నమ్మకం లేదు. దాంతో డిస్ట్రిబ్యూటర్లు నెత్తిన గుడ్డేసుకోవాల్సిందే అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంతో రవితేజ, శ్రీనువైట్ల, ఇలియానాల కెరీర్ ఖతం అయ్యిందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇకపై వీరు మరో రూటును ఎంపిక చేసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. మొత్తానికి అమర్ అక్బర్ ఆంటోని పెద్ద డిజాస్టర్.