భరత్‌ వద్ద రూ. 1000 కోట్లు ఉన్నాయా?

ravi teja brother earns 1000 crores in draks deling

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వితేజ సోదరుడు భరత్‌ మరణం తర్వాత అనేక రకాలుగా ఆయనపై వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్‌ తీసుకున్నాడని, మందు బాగా తాగి ఉండటం వల్ల చనిపోయాడు అని కొందరు అంటుండగా, మరి కొందరు మాత్రం కావాలే ఆగి ఉన్న లారిని ఢీ కొట్టాడు, చనిపోయాడు అంటున్నారు. మొత్తానికి భరత్‌ మరణం తర్వాత పలు రకాలుగా వార్తలు షికార్లు చేస్తూనే ఉన్నాయి. తాజాగా మరో వార్త ఒకటి భరత్‌ గురించి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదే భరత్‌ ఆస్తులు. 

భరత్‌ పెద్దగా సినిమాల్లో రాణించలేక పోయాడు. అన్న రవితేజ ప్రోత్సాహం లభించినా కూడా అవకాశాలను దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు. అడపా దడపా చిన్న చిన్న పాత్రల్లో మాత్రమే కనిపిస్తూ వచ్చాడు. అలాంటి భరత్‌ ఏకంగా వెయ్యి కోట్లు సంపాదించాడని, అతడికి ఆర్థికంగా ఏ ఇబ్బంది లేదని, మీడియాలో వస్తున్నట్లుగా ఆర్థిక ఇబ్బందుల వల్ల అన్నను ఎప్పుడు కూడా చేయి చాచి అడగలేదు అని, ప్రస్తుతం ఆయన ఉంటున్న అపార్ట్‌మెంట్‌ కూడా సొంతంగా కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. భరత్‌ విదేశాల నుండి లక్షల రూపాయలకు డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుని కోట్ల రూపాయలకు అమ్మేవాడని, అలాగే పలు ఇల్లీగల్‌ పనులు కూడా చేశాడని అలా వేయి కోట్లు సంపాదించాడంటూ ప్రచారం జరుగుతుంది. మొత్తానికి భరత్‌ ఆస్తుల విషయం పతాక స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఈ  విషయమై రవితేజ కుటుంబం ఏమైనా స్పందిస్తుందా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు