పిక్‌టాక్‌ : ఇదిగో జూ॥ మాస్‌ రాజా

ravi-tejas-son-mahadhan-debut-in-raja-the-great-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత రెండు మూడు రోజులుగా మాస్‌ మహారాజా రవితేజ తనయుడు మహాధన్‌ తెరంగేట్రం చేయబోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే. తాజాగా ఆ వార్తలపై క్లారిటీ వచ్చింది. రవితేజ తనయుడు మహాధన్‌ ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో ఒక అంధ బాలుడిగా నటిస్తున్నాడు. తాజాగా చిత్రీకరణలో కూడా పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు స్వయంగా ఆ స్టిల్స్‌ను విడుదల చేయడం జరిగింది. మహాధన్‌ చేతిలో కర్రను పట్టుని ఉండటంతో గుడ్డి వాడిగా కనిపించబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది. 

ఇక మహాధన్‌ చేస్తున్న పాత్ర రవితేజ పోషిస్తున్న పాత్ర ఒక్కటేనా లేక వేరు వేరా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. రవితేజ పోషించే పాత్రకు సంబంధించిన చిన్నప్పటి సన్నివేశాలను మహాధన్‌ చేస్తున్నాడని కొందరు అంటున్నారు. మరి కొందరు మాత్రం రవితేజకు స్నేహితుడిగా లేదా మరో పాత్రలో జూనియర్‌ మాస్‌ మహారాజ్‌ కనిపిస్తాడనే టాక్‌ వినిపిస్తుంది. రవితేజ తనయుడు గురించి మీడియాలో రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తలు నిజం అని తేలిపోవడంతో సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి సినిమాతో మహాధన్‌ ఆకట్టుకుంటాడా అనేది చూడాలి.

Inline image 1

మరిన్ని వార్తలు:

మోక్షు సినీ ఎంట్రీ పై బాలయ్య స్వీట్ న్యూస్.

కొత్త భాష‌లు నేర్చుకుంటున్న ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధ‌

అర్జున్ రెడ్డి 3 గంట‌ల 40 నిమిషాలు?