Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగార్జున భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ‘హలో’. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదలైంది. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా స్థాయిని పెంచే విధంగా టీజర్ ఉందని ప్రశంసలు దక్కించుకుంది. ఏకంగా 8 మిలియన్‌ల వ్యూస్‌ను కూడా ఈ టీజర్ పొందింది. ఈ సమయంలోనే యూట్యూబ్ ఈ టీజర్‌ను తొలగించడం అందరికి షాకింగ్ అయ్యింది. కాపీరైట్ క్లైమ్ అవ్వడంతో హలో టీజర్‌ను తొలగించినట్లుగా యూట్యూబ్ వెళ్లడి చేసింది. ఒక తెలుగు స్టార్ హీరో సినిమా టీజర్ ఇలా కాపీ రైట్ క్లైమ్ అయ్యి డిలీట్ అవ్వడం ప్రథమం. దాంతో అక్కినేని వారి పరువు గంగలో కలిసినట్లయ్యింది.
సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘హలో’ టీజర్ వివాదంలో మొత్తం తప్పు యూట్యూబ్‌దే అని సమాచారం. ‘హలో’ టీజర్‌కు వాడిన మ్యూజిక్ బిట్‌ను ఒక సంస్థ నుండి కొనుగోలు చేయడం జరిగింది. అయితే మద్య వర్తులు ఎవరో కావాలని యూట్యూబ్‌కు కాపీ రైట్ క్లైమ్ చేయడం జరిగింది. దాంతో టీజర్‌ను డిలీట్ చేశారు. అసలు సంస్థ నుండి తాము కొనుగోలు చేసినట్లుగా యూట్యూబ్‌కు ‘హలో’ యూనిట్ సభ్యులు తెలియజేయడంతో మళ్లీ టీజర్‌ను పోస్ట్ చేయడం జరిగింది. అయితే డిలీట్ చేశారు అంటూ వార్తలు రావడంతో కాపీ కంటెంట్ అనే విమర్శలు ప్రారంభం అయ్యాయి.
అసలు విషయం బయటకు వచ్చే సమయానికి ‘హలో’ పై బ్యాడ్ టాక్ వచ్చేసింది. అఖిల్ ఈ టీజర్‌ను ముంబయిలోని ఒక సంస్థతో కట్ చేయించారు. వారికి ఇదే ట్యూన్‌ను వాడాలని అఖిల్ సూచించాడు. వారు కాపీరైట్‌ను తీసుకున్నా కూడా యూట్యూబ్‌మాత్రం గుర్తించకుండా పొరపాటున డిలీట్ చేసి, ఆ తర్వాత మళ్లీ పోస్ట్ చేసింది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.