Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఎక్కువకాలం సీఎం గిరీ చేసిన నేతల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే ఎక్కువ కానీ ఏమంటూ వచ్చిందో రాష్ట్ర విభజన అటు ఏపీ, ఇటు తెలంగాణాల్లో టీడీపీ, టీఆర్ ఎస్‌లు సర్కారును ఏర్పాటుచేశాయి. ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత అయితే మరొకరు వెలమ దొర వర్గానికి చెందిన వారు. దీంతో రెడ్డి వర్గాన్ని ఆదుకునేందుకు సరయిన నేత ఎవరూ కనపడడం లేదు. దీంతో ఇక వడ్డించేవాడు మనోడైతే.. ఎప్పుడు కూర్చున్నా కడుపు నిండతుందనే సామెత.. రెడ్డి సామాజికవర్గం విషయంలో. నిజమనే నిర్ణయానికి వచ్చారత ఆ సామాజిక వర్గ నేతలు అందుకే ఈ సారి రెండు రాష్ట్రాలలో ఒక్క దానిలో అయినా నిర్ణయాత్మకశక్తిగా తాము మారాలని భావించి ఇటీవల రెడ్డి సమరబేరీ నిర్వహించారని తెలుస్తుంది.
బయటకు సామాజికవర్గ ఆత్మీయ సమావేసంగా చెబుతున్నా ఈ వేదికగా అనేక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. ఆంధ్రా విషయం పక్కన పెడితే తెలంగాణాలో అన్ని విధాలుగా బలమయిన నేతలు రెడ్డి వర్గంలోనే ఉన్నారు. అందుకే కేసీఆర్ తన చుట్టూ అదే వర్గాన్ని రక్షణకవచంగా ఉంచుకున్నారనే వాదన కూడా ఉంది. కానీ పేరుకు మాత్రమే పెత్తనమని.. ఏ జీవో విడుదల చేయాలన్నా తలసాని, కేటీఆర్, హరీష్‌రావు వంటి వారి పలుకుబడి మాత్రమే సాగుతుందని చేతుల్లో ఏమీ లేదనే వాదన కూడా చాలా మంది రెడ్డి సామాజిక వర్గ మంత్రుల్లో ఉంది. అందుకే రాబోయే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. దానిలో భాగ,గానే ఇప్పటికే కాంగ్రెస్‌లోకి రేవంత్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, త్వరలో మరో కీలక రెడ్డి నేత కూడా హస్తం అందుకోనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ వర్గానికి చెందిన 21 మంది టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పార్టీనుంచి బయటకు రావాలని సమావేశం నిర్వహించారనే పుకార్లు కూడా అప్పట్లో షికారు చేశాయి. కానీ కేసీఆర్ జోక్యంతో ఆ తరువాత అందంతా ఒట్టిదేనంటూ కొట్టిపారేశారు.
అయితే ఇది నిజమేనంటూ నిఘావిభాగం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయంసంగా మారింది. అంటే ఎన్నికలకి మరో ఏడాది సమయం ఉన్న సమయంలో వీరంతా ఒక్కచోటికి చేరటంవెనుక అంతరార్ధం . అధికార పార్టీలో తమ వర్గానికే అగ్రతాంబూలం ఇవ్వాలని అలా ఇచ్చిన పార్టీ నే గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారట. అంటే ఒకరకంగా చూస్తే తెలంగాణాలో కాంగ్రెస్ సీఎం అభ్యర్ధులు అంతా దాదాపు రెడ్డి సామాజిక వర్గం వారే దీంతో ఈసారి రెడ్డి సామాజిక వర్గం అంతా కాంగ్రెస్‌కు సపోర్ట్ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రానున్న ఎన్నికలకి కేసీఆర్ ఇంకేమి సామదాన దండోపాయాలు ప్రయోగిస్తారో చూడాలి మరి.