అమెరికాలో తెలుగు హీరోయిన్స్‌తో కిషన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ వ్యవహారంను అక్కడ పోలీసులు గుట్టు రట్టు చేసిన విషయం తెల్సిందే. పోలీసులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో పలువురి పేర్లను కిషన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. కిషన్ చెప్పిన హీరోయిన్స్‌కు మరియు ఆయన డైరీలో ఉన్న హీరోయిన్స్‌తో అమెరికా పోలీసులు సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నాలు చేశారు. కొందరితో పోలీసులు ఇప్పటికే విచారణ జరిపారు. అయితే ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుండి హీరోయిన్ రెజీనా పేరు బాగా ప్రచారం జరుగుతుంది. అమెరికాలో పలు సార్లు ఈమె వ్యభిచారంకు పాల్పడ్డట్లుగా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. పోలీసులు కూడా రెజీనాతో మాట్లాడారు అంటూ వార్తలు వస్తున్నాయి.
గత కొన్ని వారాలుగా ఈ విషయమై తారా స్థాయిలో చర్చ జరుగుతుంది. కాని రెజీనా మాత్రం ఇన్నాళ్లకు నోరు తెరిచింది
. తాజాగా రెజీనా మాట్లాడుతూ ఆ వ్యవహారంకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను వెంటనే స్పందిస్తే అంతా కూడా నన్ను కార్నర్ చేస్తారనే ఉద్దేశ్యంతో ఆలస్యంగా స్పందిస్తున్నాను. అసలు తనకు సంబంధం లేని విషయంలో నన్ను ఇరికించి వార్తలు వేస్తున్నారు. ఒక వ్యక్తి గురించి ఆరోపణలు వస్తున్న సమయంలో ఆమెను సంప్రదించి వాటిపై వార్తలు ప్రచురితం చేయాలనే విజ్ఞత ఏ ఒక్కరికి లేదు అంటూ మీడియా వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాల గురించి పూర్తిగా చెబుతాను అని, ప్రస్తుతానికి మీడియాలో తనపై వస్తున్న వార్తలను నమ్మవద్దంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. నిప్పులేనిదే పొగ రాదు అంటారు. మరి ఆ వ్యవహారంతో సంబంధం లేనిదే రెజీనా పేరు ఎలా బయటకు వచ్చింది, ఎంతో మంది హీరోయిన్స్ ఉండగా ఆమెనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.