రేణుదేశాయ్ రెండవ పెళ్లి గురించి పవన్ ఫ్యాన్స్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జీవితాంతం పవన్‌కు మాజీ భార్యగానే రేణుదేశాయ్ ఉండాలని కొందరు కోరుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం పవన్ పిల్లలకు అన్యాయం చేయకుండా, వారికి ఇబ్బంది కలగకుండా రేణు రెండవ పెళ్లి చేసుకుంటే పర్వాలేదు అంటూ కొందరు భావిస్తున్నారు. మరి కొందరు మాత్రం పవన్ మరో పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె మాత్రం ఎందుకు రెండవ పెళ్లి చేసుకోవద్దంటూ కొందరు అంటున్నారు. మొత్తానికి ఎక్కువ మంది ఆలోచిస్తున్న విషయం వారి పిల్లలు అకీరా మరియు ఆద్యల గురించి. ఇప్పటికే పవన్ పెళ్లి చేసుకున్న కారణంగా వారు తల్లి వద్ద ఉంటున్నారు. ఇప్పుడు తల్లి కూడా పెళ్లి చేసుకుంటే వారి పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అందుకే అకీరాకు ఈ పెళ్లి ఇష్టం లేదని సోషల్ మీడియాలో పదే పదే కామెంట్స్ వస్తున్నాయి.
ఎంగేజ్మెంట్కు ముందు పవన్ వద్దకు అకీరా రావడం జరిగింది. దాంతో రేణు వివాహం ఇష్టం లేక పోవడం వల్లే తండ్రి వద్దకు అకీరా వచ్చాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఎంగేజ్మెంట్ సమయంకు తన కొడుకు తనతోనే ఉన్నాడు అంటూ రేణుదేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక పదే పదే తన పిలల్ల సంతోషం కోసం, వారి అనుమతితో, వారి ఇష్టానుసారంగానే తాను రెండవ పెళ్లికి సిద్దం అయినట్లుగా చెబుతూ వస్తుంది. పవన్ ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ అదే విషయాన్ని అడగడం, ఆమె మళ్లీ మళ్లీ తన పిల్లలకు ఇష్టమే అంటూ చెప్పడంతో రేణుదేశాయ్ అబద్దంను నిజంలా చూపించేందుకు మళ్లీ మళ్లీ చెబుతుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అబద్దంను పది సార్లు చేస్తే లేదా చెప్తే అదే నిజం అయిపోతుంది. ఇప్పుడు అలాగే రేణుదేశాయ్ కూడా తన పిల్లలకు ఇష్టం లేకున్నా కూడా రెండవ పెళ్లి చేసుకుంటుందా ఏంటీ అంటూ కొందరు మీడియా మిత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.