Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌లో ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారం పతాక స్థాయిలో చర్చ జరుగుతుంది. ఏ నోట విన్నా కూడా ఈ విషయమై చర్చించుకోవడం కనిపిస్తుంది. ఎవరు డ్రగ్స్ తీసుకుంటారు, ఎవరు నోటీసులు అందుకున్నారు అంటూ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ప్రజలు ఈ విషయమై మీడియా ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటి సంచలన కేసును విచారిస్తున్న అకున్ సబర్వాల్ 11 రోజుల వ్యక్తిగత సెలవులు తీసుకోవడంపై ఒక్కసారిగా విమర్శలు వెళ్లువెత్తాయి. ప్రభుత్వంకు చెందిన కొందరు డ్రగ్స్ కేసులో ఉన్న కొన్ని పేర్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అకున్ సబర్వాల్‌ను ఒత్తిడి చేసి లీవ్‌పై వెళ్లాల్సిందిగా ఆదేశించారంటూ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వంకు చెందిన కొందరు పెద్దలు సినీ పరిశ్రమలోని డ్రగ్స్ తీసుకునే వారిని మరియు వారి సన్నిహితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు విమర్శలు చేయడంతో ఈ కేసును విచారిస్తున్న అకున్ సబర్వాల్ తన వ్యక్తిగత లీవ్‌ను రద్దు చేసుకున్నారు. లీవ్‌పై వెళ్తే అనేక అనుమానాలు వస్తాయనే ఉద్దేశ్యంతో ఆయన విచారణ పారదర్శకంగా సాగుతుంది అని చెప్పేందుకు లీవ్‌ను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అకున్ లీవ్ రద్దు చేసుకున్న తర్వాత కూడా పలువురు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కొన్ని పేర్లు రాకుండా చూశారని, మొత్తం జాబితాను విడుదల చేయాల్సిందే అంటూ డిమాండ్ వస్తుంది.
మరిన్ని వార్తలు: