బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ‘కవచం’ చిత్రాన్ని డిసెంబర్ 7వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. ఇటీవలే టీజర్ విడుదల సందర్బంగా సినిమాను డిసెంబర్ 7న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే అదే రోజున తెలంగాణ ఎన్నికలు జరుగబోతున్న విషయం తెల్సిందే. తెలంగాణ ఎన్నికలు ఉన్న కారణంగా సినిమాపై ఎక్కువ మంది శ్రద్ద పెట్టక పోవచ్చు. అదే సమయంలో సినిమా గురించి జనాల్లో చర్చ జరగక పోవచ్చు. అందుకే సినిమా విడుదల చేస్తే కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది.
ఈనెల 29న ‘2.0’ చిత్రం విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం విడుదలై మంచి సక్సెస్‌ను దక్కించుకుంటే రెండు వారాల పాటు జోరు భారీ ఎత్తున కొనసాగే అవకాశం ఉంది. అదే జరిగితే ‘కవచం’ మూవీ ఓపెనింగ్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. ఇలా రెండు రకాలుగా కవచం మూవీపై ప్రభావం ఉన్న కారణంగా సినిమాను వాయిదా వేయడం ఉత్తమం అని నిర్ణయించుకున్నారట. డిసెంబర్ రెండవ వారం చివర్లో సినిమా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రంలో కాజల్‌తో పాటు మెహ్రీన్ హీరోయిన్స్‌గా నటించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టాలి అంటే సేఫ్ జోన్లో విడుదల కావాల్సి ఉంది.