శృతి మించుతున్న బిగ్‌ బాస్‌ హింస…!

Roll Rida Crying In Bigg Boss House

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ముగింపు దశకు చేరుకుంది. ఈ సమయంలోనే ఇంట్లో హీట్‌ మరింతగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఆరుగురు సభ్యుల్లో కౌశల్‌ ఒక్కడు ఒక వైపు కాగా మిగిలిన అయిదుగురు సభ్యులు ఒక వైపు అయ్యారు. తాజాగా ఒక టాస్క్‌లో అంతా కలిసి కౌశల్‌ను టార్గెట్‌ చేయడం జరిగింది. తమలో ఎవరు గెలవకపోయిన కూడా కౌశల్‌ మాత్రం ఓడిపోవాల్సిందే అంటూ అంతా ఆటను ఆడారు. కౌశల్‌పై తనీష్‌ శారీరక హింసకు కూడా పాల్పడటం జరిగింది. ఇక తనీష్‌ను కూడా కౌశల్‌ గాయపర్చడంతో రచ్చ రచ్చ అయ్యింది.

roll-rid-crying

ఈ విషయంలో బిగ్‌ బాస్‌ కూడా చాలా సీరియస్‌ అయ్యాడు. తాజాగా నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల మద్య వాడి వేడి చర్చ సాగింది. పదే పదే విసిగిస్తున్న సమయంలో కౌశల్‌ అందరు ఎందుకు కుక్కల్లా నా వెంట పడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో ఆ వ్యాఖ్యలపై సామ్రాట్‌ మరియు రోల్‌ రైడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోల్‌ రైడా ఏకంగా కన్నీరు పెట్టుకోవడంతో పాటు కౌశల్‌ కాళ్లు పట్టుకునేందుకు సిద్దం అయ్యాడు. ఈ విషయంలో కౌశల్‌ను టార్గెట్‌ చేస్తూ వారు చేసిన విమర్శలు తారా స్థాయికి చేరాయి. మొత్తానికి బిగ్‌ బాస్‌ ఇంట్లో హింస పెరిగి పోతూనే ఉంది.

big-boss