నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్‌’పై విమర్శలు

rumours-on-mega-daughter-niharika-happy-wedding-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా వారసురాలు నిహారిక ‘ఒక మనస్సు’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యి మంచి పేరు తెచ్చుకుంది. ఈమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. కాని దాదాపు రెండు సంవత్సరాల పాటు ఏ సినిమాలో నటించకుండా ఉంది. ఎట్టకేలకు ఇటీవలే నిహారిక రెండవ సినిమా ప్రారంభం అయ్యింది. ఆ సినిమా ఇంకా సెట్స్‌పై ఉండగానే మూడవ సినిమా కూడా అధికారిక ప్రకటన వచ్చింది. మూడవ సినిమాను సుమంత్‌ అశ్విన్‌తో ‘హ్యాపీవెడ్డింగ్‌’ అనే టైటిల్‌తో ఈ అమ్మడు చేయబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది.

‘హ్యాపీవెడ్డింగ్‌’ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖులు ఈ సినిమాలో నటించబోతున్నారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. కాని ప్రేక్షకులు మరియు విమర్శకులు మాత్రం ఈ సినిమాపై అప్పుడే పెదవి విరుస్తున్నారు. నిహారికకు జోడీగా సుమంత అశ్విన్‌ ఏంటి అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. వీరిద్దరి జంట ఏమాత్రం బాగోదని, సుమంత్‌ అశ్విన్‌కు అసలు సినిమాల్లో హీరోగా నటించే పీచర్స్‌ లేవు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిహారికకు తమ్ముడిగా సుమంత్‌ అశ్విన్‌ ఉంటాడు అని కొందరు సోషల్‌ మీడియాలో అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. ప్రారంభం కాకుండానే విమర్శలు ఎదుర్కొంటున్న ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.