Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘డీజే’ చిత్ర కలెక్షన్స్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ చిత్ర కలెక్షన్స్ కంటే ఎక్కువ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన నేపథ్యంలో చిత్ర ఆఫీస్‌పై మెగా ఫ్యాన్స్ దాడికి దిగిన విషయం తెల్సిందే. ‘డీజే’ చిత్ర నిర్మాత అయిన దిల్‌రాజు ఆఫీస్‌పై కూడా దాడి జరిగింది. ఆ దాడిని సినీ వర్గాల వారు తప్పుబట్టారు. దిల్‌రాజు కూడా తాము చిరంజీవి సినిమాను తక్కువ చేసి ఏ రకమైన ప్రకటన చేలేదు అని, అది కొందరు ఆకతాయిలు చేసిన పని అంటూ చెప్పాడు. అయితే ‘డీజే’ చిత్రం ఆఫీస్‌పై మెగా ఫ్యాన్స్ దాడి వెనుక నాగబాబు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
నాగబాబు సూచన మేరకే ఆ దాడి జరిగిందని, మరే నిర్మాత కూడా అలాంటి ప్రకటనలు చేయకుండా హెచ్చరికగా నాగబాబు అలా ప్లాన్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే నాగబాబుకు ఆ దాడితో సంబంధం లేదని మెగా వర్గాల వారు అంటున్నారు. అసు నాగబాబు అలా ఎందుకు దాడి చేయిస్తాడు అని, ప్రస్తుతం తన కొడుకు వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా ఫిదాను దిల్‌రాజు నిర్మించాడు అని, తన కొడుకు సినిమాను నిర్మించిన నిర్మాతపై అలాంటి దాడి నాగబాబు చేయించాడు అనడంలో అర్థం లేదని, వారి సినిమాల మీద వారే దాడు చేయించుకోరు అని, అయితే కొందరు మెగా ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ఇలా చేసి ఉంటారు అంటున్నారు. నాగబాబు మాత్రం తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించలేదు.
మరిన్ని వార్తలు